Sharad Pawar: త్వరలో ప్రజలే నీతీశ్‌కు బుద్ధి చెబుతారు: శరద్‌ పవార్‌

ఎన్డీయేతో పొత్తు కుదుర్చుకొని బిహార్‌లో ప్రభుత్వం ఏర్పాటుచేసిన నీతీశ్‌ కుమార్‌పై ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ మండిపడ్డారు. 

Published : 29 Jan 2024 12:53 IST

ముంబయి: బిహార్‌లో మహాకూటమికి వీడ్కోలు పలికిన నీతీశ్‌ కుమార్‌ (Nitish Kumar) భాజపాతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయడంపై విమర్శలు తలెత్తుతున్నాయి. దీనిపై ఎన్సీపీ (NCP) అధినేత శరద్‌పవార్‌ (Sharad Pawar) స్పందిస్తూ నీతీశ్‌ చర్యపై మండిపడ్డారు. ఆదివారం జరిగిన ఓ సమావేశంలో ఆయన విమర్శలు గుప్పించారు.

‘‘ఇంతకాలం భాజపాకు వ్యతిరేకంగా మాట్లాడిన నీతీశ్‌ కుమార్‌కు ఒక్కసారిగా ఏం జరిగిందో తెలియట్లేదు. భాజపా మినహా మిగిలిన పార్టీలతో బిహార్‌లో సమావేశం ఏర్పాటుచేసిన ఘనత ఆయనకు దక్కుతుంది. పట్నాలో ఏం జరిగినా.. రోజుల వ్యవధిలో ఇలాంటి పెనుమార్పు ముందెన్నడూ చూడలేదు. ఆయన భాజపాతో చేతులు కలుపుతారని అసలు ఊహించలేదు. మళ్లీ ఎన్డీయేతో పొత్తు పెట్టుకోవడంపై ఆయనకే స్పష్టత లేదు. దీనికి బదులుగా భవిష్యత్తులో ప్రజలు నీతీశ్‌కు తగిన గుణపాఠం చెబుతారు.

ఉన్నత పదవిలో ఉండి అలా ప్రవర్తించడం తగదు

ఊసరవెల్లి కొత్త రంగులు వెతుకోవాల్సి వస్తోంది

మరోవైపు నీతీశ్‌ కుమార్‌ చర్యపై కాంగ్రెస్‌ తీవ్రంగా మండిపడుతోంది. ‘భారత్‌ జోడో న్యాయ్‌ యాత్ర’ నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే రాజకీయ నాటకం ఆడుతున్నారని పార్టీ సీనియర్‌ నేత జైరాం రమేశ్‌ (Jairam Ramesh) అన్నారు. ‘‘కొందరు ప్రతిరోజూ ఎన్నో రంగులు మారుస్తున్నారు. దీంతో ఊసరవెల్లి కూడా కొత్త రంగుల కోసం వెతుకోవాల్సి వస్తోంది’’ అని ‘ఎక్స్‌’ (ట్విటర్‌) వేదికగా ఎద్దేవా చేశారు. నీతీశ్‌ కుమార్‌ తమకు ద్రోహం చేశారని.. సరైన సమయంలో బిహార్‌ ప్రజలు ఆయనకు బుద్ధి చెబుతారని అన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని