Uddhav vs Shinde: ‘గంగలో మునిగినంత మాత్రాన’..: శిందేపై ఉద్ధవ్‌ విసుర్లు

Eenadu icon
By National News Team Published : 28 Feb 2025 00:11 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

ఇంటర్నెట్‌ డెస్క్‌: మహా కుంభమేళాలో పాల్గొనలేదంటూ మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్‌ శిందే (Eknath Shinde) చేసిన విమర్శలకు శివసేన (యూబీటీ) అధ్యక్షుడు, మాజీ సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే దీటుగా స్పందించారు. గంగలో మునిగినంత మాత్రాన మహారాష్ట్రకు చేసిన ద్రోహమనే పాపం తొలగిపోదంటూ మండిపడ్డారు. మరాఠీ భాషా గౌరవ్‌ దివస్‌ సందర్భంగా ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఉద్ధవ్‌ (Uddhav Thackeray).. నయా హిందుత్వవాదులు తమ పార్టీకి రాముడి గురించి బోధించాల్సిన అవసరం లేదంటూ దుయ్యబట్టారు.

ప్రయాగ్‌రాజ్‌లో 45రోజుల పాటు సాగిన మహా కుంభమేళాకు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిందే సహా శివసేన ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఇదే అంశంపై ఇటీవల మాట్లాడుతూ .. ఉద్ధవ్‌ ఠాక్రే వెళ్లకపోవడాన్ని తప్పుపట్టారు. గాంధీ, ఠాక్రే కుటుంబాలు కుంభమేళాకు హాజరు కాలేదంటూ అడిగిన ప్రశ్నకు శిందే ఈ విధంగా బదులిచ్చారు.

‘‘తాము హిందువులని ఎప్పుడూ చెప్పుకుంటారు. అలాంటివాళ్లు కుంభమేళాకు ఎందుకు వెళ్లలేదు?మేం హిందువులమని గర్వంగా చెప్పుకోవాలని బాల్‌ ఠాక్రే నినదించేవారు. కానీ, ఇప్పుడు తమను తాము హిందువులుగా చెప్పుకొనేందుకే వాళ్లు (ఉద్ధవ్‌ను ఉద్దేశిస్తూ) భయపడుతున్నారు’’ అని ఏక్‌నాథ్‌ శిందే చేసిన విమర్శలకు ఠాక్రే దీటుగా స్పందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    సుఖీభవ

    చదువు