Ramdev: ఆ వ్యాఖ్యలు ఉపసంహరించుకోండి..

అల్లోపతి వైద్యంపై యోగా గురువు రామ్‌దేవ్‌ బాబా చేసిన వ్యాఖ్యలను కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి ఖండించారు. ఆయన వ్యాఖ్యలు దురదృష్టకరమని అన్నారు. వ్యాఖ్యలను వెంటన...

Published : 23 May 2021 21:38 IST

రామ్‌దేవ్‌కు ఆరోగ్యశాఖ శాఖ మంత్రి లేఖ

దిల్లీ: అల్లోపతి వైద్యంపై యోగా గురువు రామ్‌దేవ్‌ బాబా చేసిన వ్యాఖ్యలను కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి ఖండించారు. ఆయన వ్యాఖ్యలు దురదృష్టకరమని అన్నారు. వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని రామ్‌దేవ్‌ బాబాకు సూచించారు. అల్లోపతి వైద్యంపై రామ్‌దేవ్‌ చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగిన నేపథ్యంలో ఆయనకు ఆదివారం లేఖ రాశారు.

‘‘కరోనా వారియర్స్‌ను అవమానించేలా మీ ప్రకటన ఉంది. వారియర్స్‌ సెంటిమెంట్‌ను దెబ్బతీసేలా ఉంది’’ అని హర్షవర్దన్‌ ఆ లేఖలో పేర్కొన్నారు. దేశంలో ఎంతోమంది ప్రాణాలను అల్లోపతి మందులు కాపాడాయని గుర్తుచేశారు. అలాంటి మందులు లక్షల మంది ప్రాణాలు చనిపోవడానికి కారణమయ్యాయని అనడం దురదృష్టకరమని చెప్పారు. వెంటనే ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని సూచించారు. అంతకుముందు అల్లోపతి వైద్యాన్ని అవివేకమైన సైన్స్‌గా రామ్‌దేవ్‌ పేర్కొన్నారు. దీనికి సంబంధించిన వీడియో సర్క్యులేట్‌ అవ్వడంతో ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ బాబా వ్యాఖ్యలను ఖండించింది. లీగల్‌ నోటీసులు పంపించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని