Anil Agarwal: అందుకే మహారాష్ట్రకు బదులు గుజరాత్‌ను ఎంచుకున్నాం: అనిల్ అగర్వాల్

గుజరాత్‌లో నిర్మించనున్న సెమీకండక్టర్‌, డిస్‌ప్లే తయారీల యూనిట్‌కు భూమి పూజ జరిగిన రెండున్నరేళ్లలో ఉత్పత్తిని ప్రారంభిస్తామని వేదాంతా రిసోర్సెస్‌ ఛైర్మన్‌ అనిల్‌ అగర్వాల్‌ స్పష్టం చేశారు. ప్లాంట్‌ ఏర్పాటుకు మహారాష్ట్రకు బదులు గుజరాత్‌ను ఎందుకు ఎంపిక చేసుకోవాల్సి వచ్చిందో వివరించారు.

Published : 13 Nov 2022 01:33 IST

దిల్లీ: గుజరాత్‌లో నిర్మించనున్న సెమీకండక్టర్‌, డిస్‌ప్లే తయారీల యూనిట్‌కు భూమి పూజ జరిగిన రెండున్నరేళ్లలో ఉత్పత్తిని ప్రారంభిస్తామని వేదాంతా రిసోర్సెస్‌ ఛైర్మన్‌ అనిల్‌ అగర్వాల్‌ ప్రకటించారు. దిల్లీలో నిర్వహించిన ఓ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్లాంట్‌ ఏర్పాటు అంశంలో కేంద్ర, గుజరాత్‌ రాష్ట్ర ప్రభుత్వాల మద్దతుకు కృతజ్ఞతలు తెలిపారు. ప్లాంట్‌ను తొలుత మహారాష్ట్రలోనే ఏర్పాటు చేయాలని భావించినప్పటికీ గుజరాత్‌తో పోల్చుకుంటే పరిస్థితులు అక్కడ అనుకూలంగా లేకపోవడం వల్లే అహ్మదాబాద్‌ను ఎంచుకోవాల్సి వచ్చిందని అన్నారు.

గనుల దిగ్గజమైన వేదాంత, తైవాన్‌కు చెందిన ఎలక్ట్రానిక్స్‌ పరికరాల తయారీ సంస్థ ఫాక్స్‌కాన్‌తో కలిసి భారత్‌లో తొలి సెమీకండక్టర్‌ తయారీ ప్లాంటును గుజరాత్‌లో ఏర్పాటు చేస్తున్నాయి. దాదాపు రూ.1.54 లక్షల కోట్ల పెట్టుబడితో దీనిని నిర్మిస్తున్నారు. మొత్తం పెట్టుబడిలో రూ.94 వేల కోట్లు డిస్‌ప్లే తయారీ యూనిట్‌కు, మరో రూ.60 వేల కోట్లు సెమీకండక్టర్ల తయారీకి ఉపయోగించనున్నారు. ఈ మేరకు గుజరాత్‌ ప్రభుత్వంతో వేదాంత-ఫాక్స్‌కాన్ ఒప్పందం కుదుర్చుకున్నాయి. అహ్మదాబాద్‌ జిల్లాలో 1000 ఎకరాల భూమిలో సెమీకండక్టర్‌ ఫ్యాబ్‌ యూనిట్‌, డిస్‌ప్లే ఫ్యాబ్‌ యూనిట్‌, సెమీకండక్టర్‌ అసెంబ్లింగ్‌-టెస్టింగ్‌ యూనిట్‌ను ఏర్పాటు చేయనున్నారు.ఇందుకోసం వేదాంతా-ఫాక్స్‌కాన్‌లు 60:40 నిష్పత్తిలో ఒక సంయుక్త సంస్థను ఏర్పాటు చేస్తాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని