Tamil Nadu: తమిళనాడులో భారీ వర్షాలు.. జనజీవనం అస్తవ్యస్తం

Heavy Rain In Tamil Nadu: తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దాంతో రాష్ట్రంలోని దక్షిణ ప్రాంతంలో జనజీవనం స్తంభించింది. 

Updated : 18 Dec 2023 11:55 IST

దిల్లీ: తమిళనాడు(Tamil Nadu)ను భారీ వర్షాలు ముంచెత్తాయి. ఫలితంగా ప్రధాన రహదారులన్నీ జలమయంగా మారాయి. దాంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ఈ వానలతో దక్షిణ తమిళనాడుకు చెందిన తిరునెల్వేలి, తూత్తుకుడి, తెన్కాసి, కన్యాకుమారి జిల్లాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ఆయా జిల్లాల్లో సోమవారం విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థల కార్యకలాపాలు నిలిచిపోయాయి. విమానాలు, రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ( Heavy Rain In Tamil Nadu)

వర్షాల కారణంగా పాపనాశం, పెరుంజని, పెచుపారై డ్యాముల నుంచి నీటిని వదలడంతో తిరునెల్వేలి, తూత్తుకుడి, తెన్కాసి జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీగా వరద చేరింది. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లు నీట మునిగాయి. నేడు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్(M.K.Stalin) సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. అవసరమైతే ప్రభావిత ప్రాంతాల నుంచి ప్రజలను తరలించడానికి సిద్ధంగా ఉండాలని ఆయా జిల్లాల కలెక్టర్లను స్టాలిన్‌ ఆదేశించారు.

బంగారం అక్రమ రవాణాకు భారతీయ వలస కార్మికులు!

ప్రస్తుతం భారీస్థాయిలో ఎన్డీఆర్‌ఎఫ్, పోలీసు బలగాలను మోహరించారు. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లొద్దని హెచ్చరించారు. ఈ నెల ప్రారంభంలో మిగ్‌జాం తుపాను ప్రభావంతో తమిళనాడు ఉక్కిరిబిక్కిరైంది. దాని నుంచి కోలుకుంటున్న సమయంలో మళ్లీ భారీ వర్షాలు తమిళనాడును అతలాకుతలం చేస్తున్నాయి. తూత్తుకుడిలో విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కొన్ని విమానాలను దారి మళ్లించారు. మరికొన్ని సర్వీసులను రద్దు చేశారు. వందేభారత్ సహా 17 రైళ్లు రద్దయ్యాయి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని