అజయ్‌... అలియా నీరు... నిప్పు

గంగూబాయి   కతియావాడి.. ఈ సినిమా ట్రైలర్‌  చూడగానే అలియా అదరగొట్టేసింది అంటూ ప్రశంసలు

Published : 05 Mar 2021 14:34 IST

ముంబయి: గంగూబాయి   కతియావాడి.. ఈ సినిమా ట్రైలర్‌  చూడగానే అలియా అదరగొట్టేసింది అంటూ ప్రశంసలు వస్తున్నాయి. వేశ్యగా, మాఫియా క్వీన్‌గా పాత్రలను నిలబెట్టిందని నెటిజన్లు అంటున్నారు. సినిమా అంతా అలియా చుట్టూనే తిరిగినా కథలో ఓ కీలకమైన పాత్రను ప్రముఖ బాలీవుడ్‌ కథానాయకుడు అజయ్‌ దేవగణ్‌ పోషిస్తున్నారు. అలియా, అజయ్‌ తొలిసారి కలిసి నటిస్తున్న చిత్రమిది.

ఈ చిత్ర దర్శకుడు సంజయ్‌ లీలా భన్సాలీతో మాత్రం 22 ఏళ్ల క్రితం ‘హమ్‌ దిల్‌ దే చుకే సనమ్‌’ చిత్రంలో    నటించాడు అజయ్‌. ‘‘సినిమాకు అలియాయే హీరో. కథలోని కీలక సమయంలో అజయ్‌ ఎంట్రీ ఉంటుంది. ఓ విధంగా చెప్పాలంటే నీరు..నిప్పులా అజయ్‌, అలియా పాత్రల మధ్య రిలేషన్‌ ఉంటుంది. కచ్చితంగా ఇద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి’’ అని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. జులై 30న విడుదల కానుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని