Ravi teja: రవితేజకు క్షమాపణలు చెప్పిన అనుపమ్‌ ఖేర్‌.. ఎందుకంటే!

రవితేజ హీరోగా వంశీ తెరకెక్కించిన చిత్రం ‘టైగర్‌ నాగేశ్వరరావు’(Tiger Nageswara Rao). ఈ చిత్ర ప్రమోషన్‌లో పాల్గొన్న అనుపమ్‌ ఖేర్‌ ఓ విషయంలో రవితేజకు క్షమాపణలు చెప్పారు.

Published : 06 Oct 2023 17:30 IST

హైదరాబాద్‌: సినీ నేపథ్యం లేకుండా ఇండస్ట్రీకి వచ్చి ఎదిగిన వారిలో హీరో రవితేజ ఒకరు. చిన్న పాత్రలతో ఆయన నట జీవితాన్ని ప్రారంభించారు. నేడు రూ.100కోట్ల హీరోల లిస్ట్‌లో చేరి పాన్‌ ఇండియా సినిమాల్లో నటిస్తున్నారు. ఈ స్థాయికి రావడానికి ఆయన చాలా ఇబ్బందులే పడ్డారని గతంలో చెప్పారు. అయితే, నటుడు అనుపమ్‌ఖేర్‌ తాజాగా చెప్పిన ఓ సంఘటన రవితేజపై ఆయన అభిమానులకు గౌరవం మరింత పెరిగేలా చేసింది.

వంశీ దర్శకత్వంలో రవితేజ హీరోగా తెరకెక్కిన సినిమా ‘టైగర్‌ నాగేశ్వరరావు’(Tiger Nageswara Rao). ఇందులో అనుపమ్‌ ఖేర్‌ ఓ కీలకపాత్రలో కనిపించనున్నారు. తాజాగా ఈ చిత్రం ప్రమోషన్స్‌లో పాల్గొన్న ఆయన రవితేజకు ఓ విషయంలో క్షమాపణలు చెప్పారు. ‘1988లో రవితేజ నాతో ఫొటో దిగడానికి స్టూడియోకు వచ్చాడు. నేను షూటింగ్‌లో బిజీగా ఉండడంతో కుదరదన్నాను. ఆరోజు అలా అన్నందుకు ఇప్పుడు సారీ చెబుతున్నాను’ అన్నారు. దీంతో పక్కనే ఉన్న రవితేజ ‘సర్‌ ప్లీజ్‌’ అంటూ అనుపమ్‌కు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. అయితే, ఈ సంభాషణంతా సరదాగానే జరిగినప్పటికీ రవితేజ అభిమానులు మాత్రం ఆయన్ని తెగ పొగిడేస్తున్నారు. ‘అప్పుడు ఫొటో కోసం వెళ్లారు. ఇప్పుడు తన సినిమాలోనే ఛాన్స్‌ ఇచ్చారు’ అంటూ కామెంట్స్‌ పెడుతున్నారు.

ఇక రవితేజకు ‘టైగర్‌ నాగేశ్వరరావు’ మొదటి పాన్‌ ఇండియా చిత్రం కానుంది. ఆయన సరసన నుపూర్‌ సనన్‌, గాయత్రి భరద్వాజ్‌ నటించారు. స్టూవర్టుపురం గజదొంగ టైగర్‌ నాగేశ్వరరావు జీవిత కథతో రూపొందింది. ఇందులో హేమలత లవణం అనే సమాజ సేవకురాలి పాత్రలో రేణూ దేశాయ్‌ కనిపించనున్నారు. అక్టోబర్‌ 20న ఈ చిత్రం అన్ని భాషల్లోనూ విడుదల కానుంది. 

రివ్యూ: మామా మశ్చీంద్ర.. సుధీర్‌బాబు కొత్త మూవీ మెప్పించిందా?

సైన్‌ లాంగ్వేజ్‌లోనూ ‘టైగర్‌ నాగేశ్వరరావు’..

తాజాగా ‘టైగర్‌ నాగేశ్వరరావు’ సినిమా ట్రైలర్‌ విడుదలై ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. అయితే, ఇప్పుడీ చిత్రం సైన్‌ లాంగ్వేజ్‌లోనూ విడుదల కానున్నట్లు చిత్రబృందం తెలిపింది. ‘భారతీయ సినీ రంగంలో మార్పునకు స్వాగతం పలుకుతున్నాం. ఎక్కువ మంది ఆడియన్స్‌కు చేరువకావడం కోసం ఈ చిత్రాన్ని సైన్‌ లాంగ్వేజ్‌లోనూ విడుదల చేయాలని నిర్ణయించుకున్నాం’ అని తెలుపుతూ ఓ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సినిమా ట్రైలర్‌ భారత్‌లో విడుదలయ్యే మొదటి సైన్‌ లాంగ్వేజ్‌ ట్రైలర్‌ అని మూవీ యూనిట్‌ పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని