Akshay kumar: ‘గూర్ఖా’గా రాబోతున్న అక్షయ్ కుమార్
బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్‌కుమార్ దూకుడు మీద ఉన్నారు. వరుసపెట్టి సినిమాలను చేస్తున్నారు. తాజాగా ఆయన చేయబోయే సినిమాల జాబితో మరో సినిమా వచ్చి చేరింది. సంజయ్ పురాన్ సింగ్ దర్శకత్వంలో ‘గూర్ఖా’అనే చిత్రంలో అక్షయ్ నటించబోతున్నారు. ఈ మేరకు తన
ఇంటర్నెట్ డెస్క్: బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్‌కుమార్ దూకుడు మీద ఉన్నారు. వరుసపెట్టి సినిమాలను చేస్తున్నారు. తాజాగా ఆయన చేయబోయే సినిమాల జాబితాలో మరో సినిమా వచ్చి చేరింది. సంజయ్ పురాన్ సింగ్ దర్శకత్వంలో ‘గూర్ఖా’ అనే చిత్రంలో అక్షయ్ నటించబోతున్నారు. ఈ మేరకు తన ‘గూర్ఖా’ ఫస్ట్‌లుక్‌ను అక్షయ్‌కుమార్ సోషల్‌మీడియాలో విడుదల చేశారు. ‘‘కొన్ని కథలు మనమే చేయాలనేంత స్ఫూర్తిని కలిగిస్తాయి. లెజెండరీ వార్ హీరో మేజర్ ఇయాన్ కార్డొజో జీవితం ఆధారంగా తీయనున్న ‘గూర్ఖా’ చిత్రం కూడా అలాంటిదే. ఆయన పాత్రలో నటించడాన్ని గొప్పగా భావిస్తున్నా’’అని పేర్కొన్నారు. ఈ చిత్రాన్ని ఆనంద్. ఎల్.రాయ్, హిమాన్షు శర్మ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
‘‘1971 ఇండో-పాకిస్థాన్ యుద్ధంలో వీరోచితంగా పోరాడిన మేజర్ జనరల్ ఇయాన్ కార్డొజో పేరు చరిత్రలో మరుగునపడిపోయింది. ఆ యుద్ధవీరుడి జీవితాన్ని సినిమాగా తీస్తున్నందుకు గర్వంగా ఉంది. అక్షయ్‌కుమార్‌తో మూడో సారి పని చేసేందుకు ఎంతో ఆతృతగా ఉన్నా’’అని ఈ చిత్రానికి సహనిర్మాతగా వ్యవహరిస్తున్న ఆనంద్. ఎల్. రాయ్ అన్నారు. అక్షయ్ నటిస్తోన్న ఆత్రంగి రే, రక్షా బంధన్ చిత్రాలకు ఆయనే దర్శకత్వం వహిస్తున్నారు. గూర్ఖా.. చిత్రం మరెంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తుందని మరో నిర్మాత హిమాన్షు శర్మ తెలిపారు.
తన జీవితం ఆధారంగా సినిమా రాబోతున్న నేపథ్యంలో మేజర్ జనరల్ ఇయాన్ కార్డొజో స్పందించారు. ‘‘1971 ఇండో-పాక్ యుద్ధానికి 50 వసంతాలు పూర్తవుతున్న నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. ఈ చిత్రం అప్పటి యుద్ధంలో భారత సైన్యం వీరోచిత పోరాటాలు, త్యాగాలను స్మరించుకునేలా చేస్తుంది. ఈ కథ భారత సైన్యంలోని ప్రతి సైన్యాధికారి విలువలు, స్ఫూర్తిని ప్రతిబింబిస్తుంది. అక్షయ్, ఆనంద్‌తో కలిసి కొత్త ప్రయాణం చేయడానికి సిద్ధంగా ఉన్నా’’అని చెప్పారు.
అక్షయ్ కుమార్ సినిమాల విషయానికొస్తే.. ఆయన నటించిన సూర్యవంశీ చిత్రం నవంబర్ 5న విడుదల కాబోతుంది. ఆనంద్.ఎల్.రాయ్ రెండు చిత్రాలతోపాటు పృథ్వీరాజ్, బచ్చన్ పాండే, రామ్సేథూ సినిమాల్లో అక్షయ్ నటిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జులై నుంచి ప్రేమలో..
ప్రభాస్ ప్రేమకథకి ముహూర్తం కుదిరింది. జులై నుంచే ఆయన కొత్త ప్రేమాయణం మొదలు కానుంది. ఇప్పటికే స్క్రిప్ట్ పక్కాగా సిద్ధమైనట్టు సినీ వర్గాలు తెలిపాయి. హను రాఘవపూడి దర్శకత్వంలో... అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మిస్తోంది. -
సంయుక్త.. ఊ కొట్టేనా?
తెలుగు చిత్రసీమలోకి వచ్చిన అనతి కాలంలోనే వరుస విజయాలందుకుంటూ స్టార్ నాయిక స్థాయికి చేరుకుంది సంయుక్తా మేనన్. ప్రస్తుతం ఆమె తెలుగులో ‘స్వయంభూ’తో పాటు శర్వానంద్‌తోనూ ఓ చిత్రం చేస్తోంది. -
ఆ ఆనందం మాటల్లో చెప్పలేనిది
‘నేను మొదటగా సంతోషపడేది నన్ను నేను తెరపై చూసుకున్నప్పుడే’ అని అంటోంది బాలీవుడ్ కథానాయిక యామీ గౌతమ్. ‘ఆర్టికల్ 370’తో భారీ విజయాన్ని అందుకుందీమె. హిందీలోనే కాదు తెలుగు చిత్రాల్లోనూ నటించి టాలీవుడ్ ప్రేక్షకులను అలరించింది. -
వాణీ కోసమే ఈ పాత్ర!
నటనకు ప్రాధాన్యమున్న పాత్రల్ని ఎంచుకుంటూ ప్రేక్షకుల్ని మెప్పిస్తుంది బాలీవుడ్ నాయిక వాణీ కపూర్. ఇప్పుడామె మరో కొత్త ప్రాజెక్టుకు పచ్చజెండా ఊపింది. ఆమె ప్రధాన పాత్రలో ‘బడ్తమీజ్ గిల్’ అనే సినిమా రాబోతున్నట్లు ప్రకటించింది చిత్రబృందం. -
‘కన్నప్ప’లో అక్షయ్ పని పూర్తి
‘కన్నప్ప’తో సినీప్రియుల్ని అలరించేందుకు సిద్ధమవుతున్నారు మంచు విష్ణు. ఆయన టైటిల్ పాత్రలో నటిస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రాన్ని ముఖేష్ కుమార్ సింగ్ తెరకెక్కిస్తున్నారు. మోహన్‌బాబు నిర్మిస్తున్నారు. బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. -
సమ్మోహనం.. ఈ కలయిక
అపూర్వమైన కలయికలు కొన్ని ఉంటాయి. వాళ్లు కలిశారంటే చాలు... సినిమాకి క్లాప్ కొట్టిన రోజే బ్లాక్‌బస్టర్ బొమ్మని తెరపై చూసేసినంత సంబరం. రజనీకాంత్ - అమితాబ్ బచ్చన్ కలయిక అచ్చం అలాంటిదే. భారతదేశం గర్వించదగ్గ తారలు ఈ ఇద్దరూ. -
త్వరలో కుందాపురానికి ‘కాంతార 1’
‘కాంతార’ సినిమాతో జాతీయ స్థాయిలో సత్తా చాటారు రిషబ్ శెట్టి. ఇప్పుడీ సినిమాకి ప్రీక్వెల్‌గా ‘కాంతార: చాప్టర్ 1’ సిద్ధమవుతోంది. రిషబ్ హీరోగా నటిస్తూ.. స్వయంగా తెరకెక్కిస్తున్న చిత్రమిది. హోంబలే ఫిల్మ్స్ సంస్థ నిర్మిస్తోంది. -
ఏమయ్యిందే గుండెకు.. ఏనాడు లేదే ఇంత ఉలుకు
అశోక్ గల్లా హీరోగా అర్జున్ జంధ్యాల తెరకెక్కిస్తున్న చిత్రం ‘దేవకీ నందన వాసుదేవ’. సోమినేని బాలకృష్ణ నిర్మిస్తున్నారు. వారణాసి మానస కథానాయిక. ప్రస్తుతం ముగింపు దశలో ఉన్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. -
అషు ‘సూపర్ డీలక్స్ బాడీ’.. సాగరకన్యలా నోరా ఫతేహి!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
రజనీకాంత్- అమితాబ్ ఆలింగనం.. ఫొటోలు వైరల్
రజనీకాంత్, అమితాబ్ బచ్చన్ కలిసి దిగిన ఫొటోలు వైరల్‌గా మారాయి. వారిద్దరూ ఎక్కడ మీట్ అయ్యారంటే?
తాజా వార్తలు (Latest News)
-
ముందు మీరు రాయ్‌బరేలీలో గెలవండి.. రాహుల్‌కు సలహా ఇచ్చిన చెస్ దిగ్గజం
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (04/05/24)
-
పాలస్తీనా మద్దతుదారులకు హిమ్స్ సంస్థ సీఈఓ గుడ్‌న్యూస్
-
‘తుపాకీతో బెదిరించి.. అత్యాచారం చేసి..’ - ప్రజ్వల్‌పై మహిళ ఫిర్యాదు
-
అషు ‘సూపర్ డీలక్స్ బాడీ’.. సాగరకన్యలా నోరా ఫతేహి!
-
3 నెలల్లో 2 కోట్ల ఖాతాలపై వాట్సప్ నిషేధం