Jawan: ఆయనతో మాట్లాడి ‘జవాన్’ను ఆస్కార్‌కు పంపుతా: అట్లీ
తాజా బ్లాక్ బస్టర్ ‘జవాన్’ విషయంలో తన మనసులో మాటను దర్శకుడు అట్లీ (Atlee) బయటపెట్టారు. ప్రస్తుతం అది సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
ముంబయి: షారుక్ ఖాన్ (Shah Rukh Khan) హీరోగా అట్లీ తెరకెక్కించిన చిత్రం ‘జవాన్’ (Jawan). ప్రస్తుతం ఇండస్ట్రీలో ఈ సినిమా హావా కొనసాగుతోంది. సెప్టెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు థియేటర్లలో ఇప్పటికీ హౌస్‌ఫుల్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన అట్లీ ఈ సినిమాను ఆస్కార్‌కు పంపే ఆలోచనలో ఉన్నట్లు తన మనసులో మాటను బయటపెట్టారు.
‘ఓ సినిమా వెనుక ఎంతో మంది శ్రమ ఉంటుంది. అలా కష్టపడి పనిచేసిన ప్రతి దర్శకుడు, టెక్నిషియన్స్, నటీనటులు.. సినిమాలో భాగమైన ప్రతి ఒక్కరూ దానికి అవార్డులు రావాలనే కోరుకుంటారు. ‘గోల్డెన్ గ్లోబ్, ఆస్కార్, నేషనల్ అవార్డు.. ఇలా ఏ పురస్కారం వచ్చిన అంతా సంతోషిస్తారు. నాకు ‘జవాన్’ను ఆస్కార్‌కు తీసుకెళ్లాలనే కోరిక ఉంది. ఈ విషయంపై షారుక్‌తో మాట్లాడి నిర్ణయం తీసుకుంటా. ఈ ఇంటర్వ్యూ షారుక్ చూస్తుంటారని ఆశిస్తున్నా. ‘సర్, మనం ఈ చిత్రాన్ని ఆస్కార్‌కు తీసుకెళ్దామా?’ అని ఆయన్ని అడుగుతాను’’ అంటూ నవ్వుతూనే ఆస్కార్‌కు వెళ్లాలనే తన కోరికను బయటపెట్టారు అట్లీ (Atlee). ప్రస్తుతం సోషల్ మీడియాలో అట్లీ కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి.
దర్శకులు విలన్లుగా కనిపిస్తే.. ‘నా సామిరంగ’!
ఇక ‘జవాన్’లో ద్విపాత్రాభినయంతో షారుక్ అదరగొట్టారు. ఆయన లుక్స్, యాక్షన్ విజువల్స్‌కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. కథానాయికగా నయనతార, ప్రతినాయకుడిగా విజయ్ సేతుపతి, ఇతర కీలక పాత్రల్లో ప్రియమణి, సాన్యా మల్హోత్ర తదితరులు ఆకట్టుకున్నారు. రూ.300కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పటివరకూ రూ.858 కోట్లు వసూళ్లు చేసి రూ.1000 కోట్ల దిశగా పరుగులు తీస్తోంది. ఇటీవలే ఈ సినిమా విజయోత్సవాలను ముంబయిలో ఘనంగా జరిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Nara Lokesh: ఇదేం అరాచక పాలన..? బండారు అరెస్టును ఖండించిన లోకేశ్
-
Siddharth: అప్పుడు వెక్కి వెక్కి ఏడ్చా: సిద్ధార్థ్
-
Tragedy: ‘మహా’ ఘోరం.. ఆస్పత్రిలో ఒకేరోజు 12మంది శిశువులు సహా 24 మంది మృతి
-
Ts News: ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. ఎన్ శివశంకర్ ఛైర్మన్‌గా పీఆర్సీ ఏర్పాటు
-
The Vaccine War: ‘ది వ్యాక్సిన్ వార్’పై స్పందించిన వివేక్ అగ్నిహోత్రి.. ఏమన్నారంటే?
-
Social Look: సమంత కల.. రుక్సార్ హొయలు.. నిహారిక ఫొటోషూట్