Bootcut Balaraju: బ్రహ్మానందం ఇలా చేయడం గ్రేట్‌: మంచు మనోజ్‌

‘బూట్‌కట్‌ బాలరాజు’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో.. హీరోలు మంచు మనోజ్‌, సందీప్‌ కిషన్‌, రోషన్‌ కనకాల, ప్రముఖ నటుడు బ్రహ్మానందం, దర్శకులు సాయి రాజేశ్‌, ఓదెల శ్రీకాంత్‌ సందడి చేశారు.

Published : 30 Jan 2024 02:16 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సోహెల్‌ (Syed Sohel), మేఘ లేఖ జంటగా శ్రీ కోనేటి తెరకెక్కించిన సినిమా ‘బూట్‌కట్‌ బాలరాజు’ (Bootcut Balaraju). ఫిబ్రవరి 2న విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం హైదరాబాద్‌లో సోమవారం రాత్రి ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ ( Bootcut Balaraju Pre Release Event) నిర్వహించింది. హీరోలు మంచు మనోజ్‌, సందీప్‌ కిషన్‌, రోషన్‌ కనకాల, ప్రముఖ నటుడు బ్రహ్మానందం, దర్శకులు సాయి రాజేశ్‌, ఓదెల శ్రీకాంత్‌ తదితరులు అతిథులుగా హాజరై సందడి చేశారు.

అనుకున్నది సాధించాడు: మంచు మనోజ్‌

‘‘ఈ సినిమా మంచి విజయం అందుకోవాలని కోరుకుంటున్నా. ఆల్‌ ది బెస్ట్‌ సోహెల్‌. కోలీవుడ్‌, బాలీవుడ్‌లో.. ‘బిగ్‌బాస్‌’లాంటి షోస్‌లో పాల్గొని, టీవీ సిరీస్‌లో నటించి, సినిమాల్లో హీరోగా మారే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. టాలీవుడ్‌లో కాస్త తక్కువ. అయినా సోహెల్‌ అనుకున్నది సాధించాడు. బ్రహ్మానందం అంకుల్‌ ఇలాంటి యువ ప్రతిభను ప్రోత్సహించడం గ్రేట్‌. ఆయన్ను చూసి తెలుగు చిత్ర పరిశ్రమ గర్వపడుతుంది’’ అని మనోజ్‌ అన్నారు.

సోహెల్‌ స్టార్‌ అవుతాడు: సందీప్‌ కిషన్‌

‘‘D ఫర్‌ దోపిడి’ సినిమా చేస్తున్న సమయంలో సోహెల్‌ నాకు పరిచయమయ్యాడు. రియలిస్టిక్‌గా నటిస్తాడు. అవకాశాలను సృష్టించుకుంటాడు. ఆలస్యమైనా ఇలాంటి వారిని ప్రేక్షకులు తప్పక ఆదరిస్తారు. సోహెల్‌ స్టార్‌ అవుతాడనే నమ్మకం ఉంది’’ అని సందీప్‌ పేర్కొన్నారు.



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని