Prashanth Varma: ప్రశాంత్‌ వర్మకు మేం అడ్వాన్స్‌ ఇవ్వలేదు: రూమర్స్‌ను ఖండించిన నిర్మాణ సంస్థ

Eenadu icon
By Entertainment Team Updated : 31 Oct 2025 14:45 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

ఇంటర్నెట్‌ డెస్క్‌: దర్శకుడు ప్రశాంత్‌ వర్మ (Prasanth varma)కు తాము అడ్వాన్స్‌ ఇవ్వలేదని తెలుపుతూ ప్రముఖ నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ (DVV Entertainment) పోస్ట్‌ పెట్టింది. ఇటీవల వరుస సినిమాలు ప్రకటించిన ప్రశాంత్‌ వర్మ.. వీటి కోసం కొన్ని నిర్మాణ సంస్థల నుంచి అడ్వాన్స్‌లు తీసుకున్నట్లు సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఆ నిర్మాణ సంస్థల జాబితాలో డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌ కూడా ఉండడంతో తాజాగా దీనిపై స్పందిస్తూ పోస్ట్‌ పెట్టింది.

‘‘డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ ఏ ప్రాజెక్ట్‌ కోసమూ అడ్వాన్స్‌ ఇవ్వలేదు. మాకు, దర్శకుడికి మధ్య వ్యాపారపరమైన ఒప్పందాలు జరగలేదు. ఏదైనా వార్తను ప్రచారం చేసేముందు అందులో నిజానిజాలు తెలుసుకోవాలని కోరుతున్నాం. ఇలాంటి వార్తలను నమ్మొద్దని విజ్ఞప్తి చేస్తున్నాం’’ అని నోట్‌ విడుదల చేసింది. తన సినిమాటిక్‌ యూనివర్స్‌కు (PVCU) సంబంధించి ప్రస్తుతం చాలా స్క్రిప్ట్‌లు సిద్ధమవుతున్నాయని.. తొలి ఫేజ్‌లో ఆరుగురు సూపర్‌ హీరోల సినిమాలు తీస్తామని గతంలో ప్రశాంత్‌ వర్మ తెలిపారు. ఇందులో భాగంగా ఇప్పటికే ‘మహాకాళీ’ (Mahakali), ‘అధీర’లను ప్రకటించారు. ప్రశాంత్‌వర్మ సినిమాటిక్‌ యూనివర్స్‌ నుంచి ప్రతి ఏడాది ఒక సినిమా విడుదలవుతుందని ఆయన తెలిపారు. 

Tags :
Published : 31 Oct 2025 14:42 IST

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని