Bigg Boss Telugu 7: బిగ్‌బాస్‌ హౌస్‌ నుంచి గౌతమ్‌ కృష్ణ ఎలిమినేట్‌

బిగ్‌బాస్‌ సీజన్‌-7లో ఈ వారం గౌతమ్‌ కృష్ణ ఎలిమినేట్‌ అయ్యాడు.

Updated : 04 Dec 2023 08:18 IST

హైదరాబాద్‌: బిగ్‌బాస్‌ సీజన్‌-7లో ఈ వారం గౌతమ్‌ కృష్ణ ఎలిమినేట్‌ అయ్యాడు. ఈ వారం ఎలిమినేషన్‌లో అర్జున్‌ అంబటి, శోభా శెట్టి, ప్రియాంక జైన్‌, ప్రిన్స్‌ యావర్‌, పల్లవి ప్రశాంత్‌, గౌతమ్‌ కృష్ణ, శివాజీ ఉన్నారు. ఎలిమినేషన్‌లో చివరకు శోభా, గౌతమ్‌ మిగిలారు. వీరిని హోస్ట్‌ నాగార్జున యాక్టివిటీ రూమ్‌లోకి పిలిచారు. మీ వెనక రెండు బ్రీతింగ్‌ డ్రాగన్స్‌ ఉన్నాయి. ఏ డ్రాగన్‌ బ్రీతింగ్‌ ఆగిపోతుందో వాళ్లు ఎలిమినేట్‌ అవుతారని అన్నారు. గౌతమ్‌ కృష్ణ వెనక ఉన్న డ్రాగన్‌ బ్రీత్‌ ఆగిపోవడంతో ఎలిమినేట్‌ అయినట్లు నాగార్జున ప్రకటించారు. అంతకుముందు బిగ్‌బాస్‌ సీజన్‌-7 ఫైనల్‌ విజేత రూ.50 లక్షలు, కారు, రూ.15 లక్షల విలువైన ఆభరణాలు గెలుపొందుతారని నాగార్జున ప్రకటించారు. ఈ రోజు కార్యక్రమంలో ‘నా సామిరంగ’ హీరోయిన్‌ గ్లింప్స్‌ను హౌస్‌మేట్స్‌కు చూపించారు. ఈ సందర్భంగా హీరోయిన్‌ అషికా రంగనాథన్‌ కార్యక్రమంలో సందడి చేసింది. ‘హాయ్‌ నాన్న’ సినిమా ప్రచారంలో భాగంగా హీరో నాని కంటెస్టెంట్లతో మాట్లాడారు.  

ఇంటి నుంచి వెళ్లే ముందు హౌస్‌లో ఎవరికి మాస్క్‌ ఉంది, ఎవరికి మాస్క్‌ లేదు అనేది చెప్పాలని గౌతమ్‌ను నాగార్జున కోరారు. 

  • అర్జున్‌: మాస్క్‌ లేదు 
  • అమర్‌: మాస్క్‌ వచ్చి పోతుంటుంది. ఫన్నీగా ఉండు
  • ప్రియాంక: నో మాస్క్‌. నిన్ను ఫైనల్‌లో చూడాలి
  • శోభ: గేమ్‌పై పోకస్‌ చేయి. అప్పుడప్పుడు మాస్క్‌ వస్తుంది
  • యావర్‌: మంచిగా ఆడు. మాస్క్‌ లేదు 
  • ప్రశాంత్‌: శివాజీ అన్నను కొట్టి నువ్వు పైకి రావాలి 
  • శివాజీ: చిన్న మాస్క్‌ ఉంది

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు