Raashii Khanna: ఆ క్యారెక్టర్‌ ప్లే చేయాలంటే భయమేసింది: రాశీఖన్నా

తాను సవాలుగా స్వీకరించి నటించిన పాత్రల గురించి రాశీఖన్నా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. అవేంటంటే?

Published : 03 May 2024 00:05 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘ఊహలు గుసగుసలాడే’ (Oohalu Gusagusalade) సినిమాలోని శ్రీసాయి శిరీష ప్రభావతి పాత్రలో ఒదిగిపోయి ‘‘ఏం సందేహం లేదు..’ ఈ నటికి మంచి భవిష్యత్తు ఉంది’’ అని అందరితో అనిపించుకున్నారు రాశీఖన్నా (Raashii Khanna). తొలి ప్రయత్నంలోనే విశేషంగా ఆకట్టుకుని అవకాశాల విషయంలో ‘జోరు’ (Joru) ప్రదర్శించారు. మరికొన్ని గంటల్లో ‘బాక్‌’ (Baak) చిత్రంతో థ్రిల్‌ పంచేందుకు రెడీగా ఉన్నారు. ఈ సినిమా ప్రచారంలో భాగంగా మరో హీరోయిన్‌ తమన్నాతో కలిసి ప్రత్యేక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. నటిగా తన ప్రయాణాన్ని గుర్తుచేసుకుంటూ సవాలు అనిపించిన పాత్రలేంటో రాశీ తెలిపారు.

‘‘కెరీర్‌ ప్రారంభంలో నేనేం చేయగలనన్న దానిపై స్పష్టత లేదు. బెల్లం శ్రీదేవి (సుప్రీమ్‌ చిత్రం)లాంటి కామెడీ టైమింగ్‌ ఉన్న పాత్రను చేస్తానని ఊహించలేదు. దర్శకుడు అనిల్‌ రావిపూడి సూచనల మేరకు నటించా. శ్రీదేవిగా నటించి నన్ను నేను కొత్తగా కనుగొన్నా. దాని తర్వాత మళ్లీ అలాంటి అవకాశం ‘పక్కా కమర్షియల్‌’ చిత్రంలో దక్కింది. అందులో ఏజెంల్‌ ఆర్నగా నటించేందుకు భయమేసింది (నవ్వుతూ). దాన్నొక ఛాలెంజ్‌గా తీసుకుని నటించా. ‘రుద్ర’లో గ్రే షేడ్‌ క్యారెక్టర్‌ ప్లే చేశా. అదొక కొత్త అనుభవం. ఓ నటిగా అన్ని రకాల పాత్రల్లో నటించాలనుంది’’ అని అన్నారు. నటిగా సుదీర్ఘ ప్రయాణం చేయడంపై తమన్నా (Tamannaah Bhatia) మాట్లాడుతూ.. ‘‘డబ్బు కోసమో పేరు కోసమో వస్తే ఇండస్ట్రీలో కొంతకాలమే ప్రయాణం చేయగలమనేది నా అభిప్రాయం. కళ కోసం మాత్రమే వచ్చే నటులకు లాంగ్‌ జర్నీ ఉంటుందని భావిస్తున్నా. సినిమా సినిమాకీ ప్రేక్షకులకు వైవిధ్యం చూపించాలని కోరుకుంటా’’ అని పేర్కొన్నారు.

ఇండస్ట్రీలో ఇలాంటి వ్యక్తిని నేను చూడలేదు: తమన్నా

‘బెంగాల్‌ టైగర్‌’ తర్వాత ఈ ఇద్దరు హీరోయిన్లు ‘బాక్‌’లో కనిపించనున్నారు. కోలీవుడ్‌ దర్శకుడు సుందర్‌ సి. (Sundar C) ప్రధాన పాత్ర పోషిస్తూ స్వయంగా తెరకెక్కించిన చిత్రమిది. హారర్‌ కామెడీగా రూపొందిన ఈ మూవీ మే 3న విడుదల కానుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు