
వినోదం పండించడమే కష్టం
‘‘ఒకేసారి రెండు మూడు కథలు సిద్ధంగా ఉంచుకోవడం నాకు నచ్చదు. ఒక సినిమా విడుదలయ్యాక.. దానికి ప్రేక్షకుల నుంచి ఎలాంటి స్పందన వచ్చిందో తెలుసుకొని, ఎలాంటి చిత్రం చేయాలనే దానిపై తుది నిర్ణయం తీసుకుంటా’’ అన్నారు హీరో వరుణ్ తేజ్. ఇటీవలే ‘గని’గా ప్రేక్షకుల్ని పలకరించిన ఆయన.. ఇప్పుడు వెంకటేష్‌తో కలిసి ‘ఎఫ్3’తో నవ్వులు పంచేందుకు సిద్ధమయ్యారు. అనిల్ రావిపూడి తెరకెక్కించిన చిత్రమిది. శుక్రవారం ప్రేక్షకుల ముందుకొస్తుంది. ఈ నేపథ్యంలోనే గురువారం హైదరాబాద్‌లో విలేకర్లతో చిత్ర విశేషాలు పంచుకున్నారు వరుణ్ తేజ్.
మీ గత చిత్రం ‘గని’ ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు. దానిపై మీరు ఓ నోట్ విడుదల చేశారు. ఎందుకలా?
‘‘ఏ చిత్రమైనా నమ్మే చేస్తాం. ‘గని’తో దాదాపు మూడేళ్లు ప్రయాణించాం. దానికోసం అందరం చాలా కష్టపడ్డాం. విడుదలకు ముందు ఎన్నోసార్లు చూసుకున్నా. నేను సాధారణంగా ‘సినిమా బాగుంటుంది.. వందశాతం ఆడుతుంది’ అని స్టేట్‌మెంట్లు ఇవ్వను. ఈ చిత్ర విషయంలో నాకు మనస్ఫూర్తిగా అనిపించింది చెప్పాను. అయితే నా అంచనాలు తప్పాయి. దానిపై నేనెవరికీ వివరణ ఇవ్వాల్సిన అవసరమైతే లేదు. నా సంతృప్తి కోసం ప్రేక్షకులకు ఓ మాట చెప్పాలనిపించింది. అందుకే ఆ నోట్ వదిలాను’’.
ఎఫ్2’ పెద్ద హిట్. దానికి సీక్వెల్‌గా ‘ఎఫ్3’ వస్తుందనగానే భారీ అంచనాలుంటాయి. ఏమన్నా ఒత్తిడిగా అనిపించేదా?
‘‘ఎఫ్2’ సినిమా చేస్తున్నప్పుడే అనిల్ రావిపూడి నాకు ‘ఎఫ్3’ ఆలోచన చెప్పారు. డబ్బు మీద తను చెప్పిన పాయింట్ నాకు బాగా నచ్చింది. చేసేద్దామన్నా. నిజానికి ఈ చిత్ర విషయంలో మాకెలాంటి ఒత్తిడి లేదు. ఏమైనా ఉంటే అనిల్‌కే ఉండాలి. మాకైతే తనపై చాలా నమ్మకం. ఎందుకంటే కామెడీ తన బలం. దీనికి తోడు ‘ఎఫ్2’కి ప్రేక్షకుల నుంచి దక్కిన ఆదరణ చూశాక మరింత ధైర్యమొచ్చింది. సీక్వెల్ ఎందుకు తీసుకురాకూడదు అనిపించింది. అందుకే ఈ ‘ఎఫ్3’ చేశాం’’.
మీకు బాగా సవాల్‌గా అనిపించిన అంశాలేంటి?
‘‘ఫైట్లు చాలా కష్టం.. కామెడీ పండించడం చాలా ఈజీ’ అని అందరూ అనుకుంటుంటారు. వాస్తవానికి వినోదం పండించడమే చాలా కష్టం. ‘ఎఫ్2’, ‘ఎఫ్3’లతో నాకీ విషయం బాగా అర్థమైంది. దానికి తోడు ఈ సినిమాలో నేను నత్తితో ఇబ్బంది పడే వ్యక్తిగా కనిపిస్తా. అలా నత్తిగా మాట్లాడుతూ.. టైమింగ్‌తో కామెడీ చేయడం ఇంకాస్త సవాల్‌గా అనిపించేది. ఇక్కడ లక్కీ విషయం ఏంటంటే.. సెట్లో అనిల్ ఏదైనా చేసి చూపిస్తాడు. ఏ పదం ఎలా మాట్లాడాలి.. ఎక్కడ ఏది నొక్కి పలకాలి చేసి చూపించేవాడు. నేను దాన్ని అనుకరిస్తూ వెళ్లిపోయేవాడిని. మొదట్లో నా పాత్ర ఎలా వస్తుందో.. ఏమోనని ఆందోళన ఉండేది. రెండు మూడు రోజులయ్యాక బాగా చేస్తున్నానన్న నమ్మకం వచ్చింది’’.
ఇంతకీ ఫన్ ఎవరిది? ఫ్రస్ట్రేషన్ ఎవరిది?
‘‘ఫన్ అయినా ఫ్రస్ట్రేషన్ అయినా సినిమాలోని అందరిదీ. డబ్బులు త్వరగా కొట్టేస్తే ఫన్ అని వీళ్లనుకుంటారు. దాని వల్ల ఎంత ఫ్రస్ట్రేషన్ వస్తుందన్నది సినిమాలో చూపిస్తారు. నత్తి ఉన్నోడు.. రేచీకటి సమస్య ఉన్నోడు ఫ్రెండ్స్ అయితే.. వాళ్లిద్దరికీ రాత్రి పూట ఓ సీన్ పడిదంటే ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఈ చిత్రంలోనూ లవ్ ట్రాక్స్ ఉన్నాయి. కానీ, అందరికీ డబ్బంటేనే ఎక్కువ ప్రేమ. దీంట్లో తమన్నా, మెహ్రీన్ పాత్రల్ని చాలా వినోదాత్మకంగా తీర్చిదిద్దారు’’.
వెంకటేష్‌తో రెండోసారి కలిసి చేయడం ఎలా అనిపించింది?
‘‘వ్యక్తిగతంగా నేను ఆయన్ని చాలా ఇష్టపడతా. సెట్లో నాకు ఓ తండ్రిలా, మంచి ఫ్రెండ్‌లా ప్రోత్సాహమిస్తుంటారు. ఆయన గత చిత్రాల అనుభవాల్ని, పెద్దనాన్న చిరంజీవితో తనకున్న అనుబంధాన్ని నాతో పంచుకునేవారు. నేను అప్పుడప్పుడు రానాకి ఫోన్ చేసి ఏడిపిస్తుంటా.. ‘మీ బాబాయ్ నీకిప్పటి వరకు చెప్పనివి నాకు చెప్పార’ని.’’
మీరెప్పుడైనా డబ్బు గురించి ఫ్రస్ట్రేట్ అయ్యారా? డబ్బుపై మీ ఆలోచన ఏంటి?
‘‘చదువుకునే రోజుల్లో డబ్బు వల్ల ఫ్రస్ట్రేట్ అయిన సందర్భాలు చాలా ఉన్నాయి. సినిమాకి వెళ్తానంటే నాన్న యాభై రూపాయలు ఇచ్చేవారు. అది దేనికీ సరిపోయేది కాదు (నవ్వుతూ). లక్కీగా మంచి స్నేహితులు ఉండటం వల్ల సర్దుకునేవాళ్లం. కొంత మందిని చూస్తే డబ్బు ఇంత ఈజీగా వస్తుందా? అనిపిస్తుంది. అయితే అంత ఈజీగా వచ్చిన డబ్బు అంతే ఈజీగా వెళ్లిపోతుంది. ‘ఎఫ్3’లోనూ అదే చెప్పాం’’.
నటుడిగా బరువైన పాత్రల నుంచి కామెడీ పాత్రల వరకు అన్నీ చేశారు. వ్యక్తిగతంగా మీకు బాగా దగ్గరైంది ఏది?
‘‘ప్రత్యేకంగా ఒకటని ఏమీ లేదు. ప్రతి సినిమా ‘ఇది నాది’ అనుకునే చేస్తా. ఓ వంద రోజులు ఇదే నా జీవితం అనుకొని కష్టపడతా. అది ‘గని’ కావొచ్చు.. ‘అంతరిక్షం’ కావొచ్చు. వీటిలో కొన్ని పాత్రలు కష్టంగా.. ఇంకొన్నీ ఈజీగా అనిపించొచ్చు. కష్టమైనా.. సులువైనా అది ఆరోజు వరకే. నేనిప్పటి వరకు చేసిన సినిమాల్లో ‘కంచె’, ‘తొలి ప్రేమ’, ‘గద్దలకొండ గణేష్’ల్లోని పాత్రలు నాకు చాలా ఇష్టం’’.
కొత్త సినిమా సంగతులేంటి?
‘‘ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఓ యాక్షన్ సినిమా చేస్తున్నా. మా నాన్న, బీవీఎస్‌ఎన్ ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. జూన్ నెలాఖరున లేదా జులైలో చిత్రీకరణ మొదలవుతుంది. లండన్‌లో ఓ 70రోజుల షూటింగ్ ఉంటుంది. ‘ఎఫ్4’కు సంబంధించి అనిల్ ఓ మూడు పాయింట్స్ చెప్పాడు. చాలా ఫన్నీగా అనిపించింది. అయితే అదెప్పుడు సెట్స్‌పైకి వెళ్తుందో ఇప్పుడే చెప్పలేను’’.
ఇప్పుడంతా పాన్ ఇండియా ట్రెండ్ నడుస్తోంది. కథల ఎంపిక ఏమైనా సవాల్‌గా అనిపిస్తోందా?
‘‘ఇప్పుడు కథల ఎంపిక మారింది. అయితే ఇది పాన్ ఇండియా సినిమా వల్ల కాదని భావిస్తున్నా. ఓటీటీలో డిఫరెంట్ కంటెంట్ పెరిగింది. ప్రేక్షకులు ఇంకా వైవిధ్యభరితమైన కథలు కోరుకుంటున్నారు. వారికి కావాల్సిన కంటెంట్ ఇవ్వడం ఛాలెంజింగ్‌గానే మారింది. ఇది ఒకరకంగా మంచిదే. కొత్త కథలు బయటకు వస్తాయి. వ్యక్తిగతంగా నేనైతే ఎలాంటి కథ చేయడానికైనా సిద్ధమే. అన్ని రకాల జానర్లు చేయాలని ఉంది’’.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
PUSHPA: ‘తగ్గేదే లే’.. అంతకంతకూ పెరుగుతోన్న ‘పుష్ప’ క్రేజ్
-
General News
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Business News
Tax on Gold: బంగారం కొనుగోలుదారులకు షాక్.. దిగుమతి సుంకం పెంపు!
-
Business News
Tax on petrol diesel exports: పెట్రోల్, డీజిల్ ఎగుమతులపై పన్ను
-
Crime News
MLC Ananthababu: ఎమ్మెల్సీ అనంతబాబు రిమాండ్ పొడిగింపు
-
Sports News
Jasprit Bumrah: అది అర్థమయ్యేసరికి బుమ్రాకు సమయం పట్టింది: సంజన
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? ( 01-07-2022)
- TS TET Results: తెలంగాణ టెట్ ఫలితాలు విడుదల.. రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండి..
- Uddhav thackeray: ఉద్ధవ్ లెక్క తప్పిందెక్కడ?
- Meena: అలా ఎంత ప్రయత్నించినా సాగర్‌ను కాపాడుకోలేకపోయాం: కళా మాస్టర్
- Salmonella: ‘సాల్మొనెల్లా’ కలకలం.. ప్రపంచంలోనే అతిపెద్ద చాక్లెట్ ప్లాంట్‌లో ఉత్పత్తి నిలిపివేత!
- Andhra News: రూ.వందల కోట్ల ఆర్థిక మాయ!
- ఈ మార్పులు.. నేటి నుంచి అమల్లోకి..
- Andhra News: ‘ఉడత ఊపితే’ తీగలు తెగుతాయా!
- Tollywood movies: ఏంటి బాసూ.. ఇలాంటి మూవీ తీశావ్..!
- Income Tax Rules: జులై 1 నుంచి అమల్లోకి రాబోతున్న 3 పన్ను నియమాలు..