ఈటీవీ విన్‌ బంపర్‌ ఆఫర్‌

తెలుగువారి అభిమాన ఎంటర్‌టైన్‌మెంట్‌ ఛానల్‌ ఈటీవీ 28వ వార్షికోత్సవం సందర్భంగా ప్రేక్షకులకు శుభవార్త చెప్పింది.

Updated : 25 Aug 2023 05:18 IST

వీకెండ్‌లో ఉచితంగా సినిమాలు, షోస్‌ స్ట్రీమింగ్‌

తెలుగువారి అభిమాన ఎంటర్‌టైన్‌మెంట్‌ ఛానల్‌ ఈటీవీ 28వ వార్షికోత్సవం సందర్భంగా ప్రేక్షకులకు శుభవార్త చెప్పింది. ఈటీవీకి చెందిన అన్ని ఛానళ్లను, అలనాటి మేటి చిత్రాల నుంచి సరికొత్త కంటెంట్‌ ఉన్న సినిమాలు, రియాల్టీ షోలను ఒకే చోటకు చేర్చిన...డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌ ఈటీవీ విన్‌ యాప్‌ను ఆగస్టు 26, 27వ తేదీల్లో ఉచితంగా యాక్సెస్‌ చేసుకునే వీలు కల్పించింది. ఇప్పటివరకు కేవలం టీవీలకే పరిమితమైన వినోదభరిత కార్యక్రమాలను ఇక మీ మొబైల్‌లో ఎప్పుడైనా, ఎక్కడైనా ఈటీవీ విన్‌ ఓటీటీ వేదిక ద్వారా వీక్షించవచ్చు. ఈ వారాంతపు కంటెంట్‌లో హాస్యనటుడు బ్రహ్మానందం సరికొత్త పాత్రలో ఒదిగిపోయి ప్రేక్షకులను మెప్పించిన ‘పంచతంత్రం’, యువ నటుడు చైతన్య కృష్ణ హీరోగా నటించిన ‘అన్నపూర్ణ ఫొటో స్టూడియో’ను కూడా వీక్షించవచ్చు. అలాగే ఈటీవీ విన్‌లో ఈటీవీ సీరియల్స్‌, రియాల్టీ షోలు కూడా చూడొచ్చు. ఈటీవీ సినిమా వీక్షకుల సౌలభ్యాన్ని గుర్తిస్తూ ఈటీవీ విన్‌ 10 గంటల క్యాచ్‌ అప్‌ ఫీచర్‌ కంటెంట్‌ను అందిస్తుంది. టెలివిజన్‌లో ప్రసారం కావడానికి ముందు ప్రేక్షకులు తమకు ఇష్టమైన షోలను విన్‌లో వీక్షించే వీలుంది. ఈ ప్లాట్‌ఫామ్‌లో లైవ్‌లో కార్యక్రమాల అనుభూతిని పొందవచ్చు. ఉదయ్‌ కిరణ్‌ హీరోగా వచ్చిన ‘చిత్రం’, తరుణ్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘నువ్వే కావాలి’, ‘ఆనందం’ లాంటి మరుపురాని చిత్రాలు ఈటీవీ విన్‌ లైబ్రరీ సొంతం.వీ విన్‌ లైబ్రరీ సొంతం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని