Cash: జబర్దస్త్‌ కమెడియన్ల పేరెంట్స్‌ మీట్‌

కంటతడి పెట్టించే ఎమోషన్స్‌, కడుపుబ్బా నవ్వించే కామెడీ, సరదాగా సాగిపోయే ఆటపాటలు.. ప్రేక్షకులకు వినోదం పంచాలంటే ఇవే కదా కావాల్సింది. వీటన్నింటిని కలగలిపి సందడి చేసేందుకు ‘క్యాష్‌’ సిద్ధమయింది. వినూత్నమైన కాన్సెప్టులతో వినోదం పంచే ‘క్యాష్‌’ ఈసారి జబర్దస్త్‌ కమెడియన్ల పేరెంట్స్‌ మీట్‌కు వేదికైంది.

Published : 11 Jul 2021 15:52 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కంటతడి పెట్టించే ఎమోషన్స్‌, కడుపుబ్బా నవ్వించే కామెడీ, సరదాగా సాగిపోయే ఆటపాటలు.. ప్రేక్షకులకు వినోదం పంచాలంటే ఇవే కదా కావాల్సింది. వీటన్నింటిని కలగలిపి సందడి చేసేందుకు ‘క్యాష్‌’ సిద్ధమయింది. వినూత్నమైన కాన్సెప్టులతో వినోదం పంచే ‘క్యాష్‌’ ఈసారి జబర్దస్త్‌ కమెడియన్ల పేరెంట్స్‌ మీట్‌కు వేదికైంది. సుమ వ్యాఖ్యాతగా ‘ఈటీవీ’లో ప్రతి శనివారం ప్రసారమయ్యే ‘క్యాష్‌’లో జబర్దస్త్‌ కమెడియన్లు వాళ్ల కుటుంబ సభ్యులతో పాల్గొని కనువిందు చేయబోతున్నారు. ప్రసాద్‌, ఇమ్మాన్యుయెల్‌, నూకరాజు, బాబు.. తమ తల్లిదండ్రులతో కలిసి ‘క్యాష్‌’ ఆడారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదలైంది. ఈ ప్రోమో ఆద్యంతం నవ్వులు పూయించేలా ఉంది. పూర్తి కార్యక్రమం జులై 17న ప్రసారం కానుంది. అప్పటి వరకూ ఈ ప్రోమో చూసి ఆనందించండి మరి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని