Kalyan Ram: ‘డెవిల్‌’.. ఆరోజే

కల్యాణ్‌ రామ్‌ కథానాయకుడిగా నవీన్‌ మేడారం తెరకెక్కిస్తున్న పాన్‌ ఇండియా చిత్రం ‘డెవిల్‌’. ది బ్రిటీష్‌ సీక్రెట్‌ ఏజెంట్‌.. అన్నది ఉపశీర్షిక. అభిషేక్‌ నామా నిర్మాత.

Updated : 07 Aug 2023 14:15 IST

ల్యాణ్‌ రామ్‌ కథానాయకుడిగా నవీన్‌ మేడారం తెరకెక్కిస్తున్న పాన్‌ ఇండియా చిత్రం ‘డెవిల్‌’. ది బ్రిటీష్‌ సీక్రెట్‌ ఏజెంట్‌.. అన్నది ఉపశీర్షిక. అభిషేక్‌ నామా నిర్మాత. సంయుక్తా మేనన్‌ కథానాయిక. నవంబరు 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ విషయాన్ని చిత్ర బృందం ఆదివారం అధికారికంగా ప్రకటించింది. ‘‘ఎవరికీ అంతు చిక్కని ఓ రహస్యాన్ని ఛేదిస్తూ ఓ బ్రిటిష్‌ ఏజెంట్‌ చేసే ప్రయాణమే ఈ చిత్ర కథాంశం. ఆ ఏజెంట్‌ పాత్రలో కల్యాణ్‌రామ్‌ ఆకట్టుకోనున్నారు. ప్రస్తుతం నిర్మాణాంతర పనులు శరవేగంగా జరుగుతున్నాయి’’ అని సినీవర్గాలు తెలిపాయి. సంగీతం: హర్షవర్ధన్‌ రామేశ్వర్‌, ఛాయాగ్రహణం: ఎస్‌.సౌందర్‌ రాజన్‌.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని