Nagarjuna: దేవుడే రాసిన కావ్యమిది

‘నా సామిరంగ’తో సంక్రాంతి బరిలో సందడి చేయనున్నారు నాగార్జున. ఆయన హీరోగా నటించిన ఈ చిత్రాన్ని నృత్యదర్శకుడు విజయ్‌ బిన్ని తెరకెక్కించారు.

Updated : 06 Jan 2024 09:18 IST

నా సామిరంగ’తో సంక్రాంతి బరిలో సందడి చేయనున్నారు నాగార్జున. ఆయన హీరోగా నటించిన ఈ చిత్రాన్ని నృత్యదర్శకుడు విజయ్‌ బిన్ని తెరకెక్కించారు. శ్రీనివాసా చిట్టూరి నిర్మాత. ఆషికా రంగనాథ్‌ కథానాయిక. అల్లరి నరేశ్‌, రాజ్‌తరుణ్‌ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ఈ నెల 14న విడుదల కానున్న నేపథ్యంలో ప్రచార కార్యక్రమాల జోరు పెంచారు. ఇందులో భాగంగా శుక్రవారం ఈ చిత్రం నుంచి ‘‘దేవుడే తన చేతితో రాసిన ఒక కావ్యం.. అంజిది కృష్టయ్యది విడదియ్యని ఒక బంధం’’ అనే పాటను విడుదల చేశారు. సినిమాలోని నాగ్‌ - అల్లరి నరేశ్‌ల పాత్రల మధ్య ఉన్న స్నేహ బంధాన్ని చూపిస్తూ సాగే పాటిది. దీనికి ఎం.ఎం.కీరవాణి స్వరాలు సమకూర్చడమే కాక స్వయంగా సాహిత్యమందించారు. శాండిల్య ఆలపించారు. ఈ పాటలో నాగ్‌, నరేశ్‌ల మధ్య స్నేహాన్ని మనసులకు హత్తుకునేలా చూపించారు. పీరియాడిక్‌ మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రానికి ప్రసన్న కుమార్‌ బెజవాడ కథ, మాటలు అందించారు. శివేంద్ర దాశరధి ఛాయాగ్రాహకుడిగా వ్యవహరించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని