John Abraham: అభిమాని బర్త్‌డే సెలబ్రేట్‌ చేసి.. ఖరీదైన గిఫ్ట్‌ ఇచ్చి.. వీడియో వైరల్‌

తన అభిమానికి జీవితంలో మరిచిపోలేని జ్ఞాపకాన్ని ఇచ్చారు బాలీవుడ్‌ నటుడు జాన్‌ అబ్రహం.

Published : 03 May 2024 00:04 IST

ఇంటర్నెట్‌ డెస్క్: అభిమాన నటులను జీవితంలో ఒక్కసారైనా చూడాలని, వీలుంటే మాట్లాడాలని ఎందరో ఆశపడతారు. అలాంటిది ఆ ఫేవరెట్‌ యాక్టరే ఫ్యాన్‌ బర్త్‌డేని సెలబ్రేట్‌ చేస్తే?.. మాటల్లో వర్ణించలేని ఆ ఆనందంలోనే ఉన్నాడు బాలీవుడ్‌ హీరో జాన్‌ అబ్రహం (John Abraham) అభిమాని అక్షయ్‌ కేదారి. తన పుట్టిన రోజు (ఏప్రిల్‌ 29)న జాన్‌ అబ్రహంను మీట్‌ అయ్యాడు అక్షయ్‌. విషయం తెలుసుకున్న హీరో కేకు కట్‌ చేసి, అభిమానికి తినిపించారు. రూ.22 వేల ఖరీదైన ఇటాలియన్‌ రైడింగ్‌ షూస్‌ను గిఫ్ట్‌ ఇచ్చి సర్‌ప్రైజ్‌ చేశారు. ‘కల నిజమైన వేళ’ అంటూ సంబంధిత వీడియోలను సోషల్‌ మీడియా వేదికగా అభిమాని పంచుకోగా అవి ఇప్పుడు వైరల్‌గా మారాయి.

ఓ వీడియోలో బూట్లు ధరించడంలో అక్షయ్‌కు అబ్రహం సాయంపడుతూ ఉంటారు. దీంతో, ఆయనపై పలువురు నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. కొందరు విమర్శలూ చేస్తున్నారు. గతేడాది ‘పఠాన్‌’లో విలన్‌గా మెప్పించిన అబ్రహం.. హీరోగా పలు సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆయన నటిస్తున్న యాక్షన్‌ డ్రామా ‘వేదా’ (Vedaa) జులై 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని