Prema: షూటింగ్‌లో నిజంగానే పాము కాటేసింది.. ఆ హిట్‌ సినిమాకు 25 ఏళ్లు..

నటి ప్రేమ (Prema) ప్రధానపాత్రలో నటించిన ‘దేవి’ (Devi) చిత్రం విడుదలై నేటికి 25ఏళ్లు పూర్తయింది.

Published : 12 Mar 2024 14:07 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కోడి రామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన సోషియో ఫాంటసీ చిత్రం ‘దేవి’ (Devi). అప్పట్లో సంచలనం సృష్టించిన ఈ సినిమా విడుదలై నేటికి 25 ఏళ్లు పూర్తయింది. నటి ప్రేమ (Prema) ప్రధానపాత్రలో నటించిన ఈ మూవీ గురించి ఆమె కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. షూటింగ్ సమయంలో జరిగిన సంఘటనను ఇటీవల ఓ ఇంటర్వ్యూలో గుర్తుచేసుకున్నారు.

‘‘లేడీ ఓరియెంటెడ్ సినిమాలు తక్కువగా వస్తున్న రోజుల్లో తీసిన చిత్రం ‘దేవి’. మంచి విజయాన్ని సాధించింది. ఆ స్థాయిలో విజయం సాధించడానికి ప్రధాన కారణం కోడి రామకృష్ణ గారే. సన్నివేశం బాగా వచ్చే వరకూ 50టేక్‌లు అయినా తీస్తారు. రాత్రిపగలూ పని చేశాం. డైలాగులు బాగా ప్రాక్టీస్‌ చేయించేవారు. దేవత ఎలా మాట్లాడుతుందో అలాగే మాట్లాడమని చెప్పేవారు. ఆ గెటప్‌ వేశాక హావభావాలు వాటంతట అవే వచ్చేస్తాయి. ‘ఇలాంటి పాముల సినిమాలు ఎవరు చూస్తార’ని అనుకున్నాం. చిత్రీకరణ మొత్తం అయ్యాక చూసి నేనే ఆశ్చర్యపోయాను. షూటింగ్‌ సమయంలో ఒక వ్యక్తిని నిజంగానే పాము కాటేసింది. అతనిని ఆసుపత్రికి తీసుకెళ్లినా లాభం లేకుండా పోయింది. ఆ బాధతో మేం రెండు రోజులు షూటింగ్‌ ఆపేశాం. క్లైమాక్స్‌ తీసేటప్పుడు కూడా మంచులో చాలా ఇబ్బందులు పడ్డాం’ అని చెప్పారు.

ఆ ఫీల్‌గుడ్‌ స్టోరీ.. పవన్‌ను దృష్టిలో పెట్టుకుని రాసిందే కానీ..!

తన సినీ కెరీర్ గురించి మాట్లాడుతూ.. ‘‘ఎయిర్‌హోస్టెస్‌ కావాలనేది నా కల. అయితే, మా అమ్మకు నన్ను ఓ నటిగా చూడాలని ఉండేది. ఆ విషయంలో మా ఇద్దరికీ గొడవ అవుతుండేది. ఆమె కలను ఎందుకు నెరవేర్చకూడదనిపించి మొదటిసారి ‘సవ్యసాచి’ అనే కన్నడ సినిమాలో నటించా. నటిగా తొలి ప్రయత్నంలోనే పరాజయం అందుకున్నా. అయినా ‘ఓం’లో అవకాశం వచ్చింది. ఆ సినిమా సూపర్‌హిట్‌. నాకు వరుస అవకాశాలు వచ్చాయి. ‘ధర్మచక్రం’తో తెలుగులోకి ప్రవేశించా. ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’, ‘క్షణ క్షణం’ లాంటి సినిమాలు చేయలేకపోయాననే బాధ ఉంది. కెమెరా ముందు కనిపించడం కోసం ఏదో ఒక పాత్రను పోషించడం నాకు ఇష్టం లేదు. వైవిధ్యమైన పాత్రల్లో నటించాలని ఉంది’’ అని ప్రేమ వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు