Saindhav: ‘సైంధవ్‌’.. సిద్ధం

‘సైంధవ్‌’గా సంక్రాంతి బరిలో సందడి చేయనున్నారు కథానాయకుడు వెంకటేశ్‌. ఆయన నటించిన ఈ 75వ చిత్రాన్ని శైలేశ్‌ కొలను తెరకెక్కించారు.

Updated : 31 Dec 2023 12:14 IST

సైంధవ్‌’గా సంక్రాంతి బరిలో సందడి చేయనున్నారు కథానాయకుడు వెంకటేశ్‌. ఆయన నటించిన ఈ 75వ చిత్రాన్ని శైలేశ్‌ కొలను తెరకెక్కించారు. వెంకట్‌ బోయనపల్లి నిర్మాత. శ్రద్ధా శ్రీనాథ్‌ కథానాయిక. నవాజుద్దీన్‌ సిద్ధిఖీ, రుహానీ శర్మ, ఆండ్రియా తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ పాన్‌ ఇండియా సినిమా జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే తాజాగా సెన్సార్‌ పనులు పూర్తి చేసుకొని యూ/ఏ సర్టిఫికెట్‌ అందుకుంది. ఈ విషయాన్ని చిత్ర బృందం శనివారం ప్రకటించింది. ‘‘భావోద్వేగాలతో నిండిన వినూత్నమైన యాక్షన్‌ కథాంశంతో ఈ చిత్రం రూపొందింది. దీంట్లోని తండ్రీకూతుళ్ల అనుబంధం అందరి మనసుల్ని హత్తుకుంటుంది. వెంకటేశ్‌ శక్తిమంతమైన పాత్రలో కనిపిస్తారు’’ అని చిత్ర వర్గాలు తెలిపాయి. ఈ చిత్రానికి సంగీతం: సంతోష్‌ నారాయణన్‌, ఛాయాగ్రహణం: ఎస్‌.మణికందన్‌.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని