సోనూసూద్ హీరోగా ‘క్రాక్’ రీమేక్..!
సోనూసూద్ హీరోగా మారనున్నాడట. ఇటీవల విడుదలై ప్రేక్షకులను అలరిస్తున్న ‘క్రాక్’ హిందీలో రీమేక్ చేయాలని భావిస్తున్నాడని తెలుస్తోంది. అవును.. బీటౌన్‌లో సాగుతున్న చర్చ ఇది. ఇటీవల మాస్ మహారాజ్ రవితేజ హీరోగా నటించిన ‘క్రాక్’ విడుదలై ప్రశంసలు అందుకుంటోంది.
ఇంటర్నెట్ డెస్క్: సోనూసూద్ హీరోగా మారనున్నాడట. ఇటీవల విడుదలై ప్రేక్షకులను అలరిస్తున్న ‘క్రాక్’ను హిందీలో రీమేక్ చేయాలని భావిస్తున్నాడని తెలుస్తోంది. బీటౌన్‌లో సాగుతున్న చర్చ ఇది. ఇటీవల మాస్ మహారాజ్ రవితేజ హీరోగా నటించిన ‘క్రాక్’ విడుదలై ప్రశంసలు అందుకుంటోంది. ఇప్పుడీ సినిమాను హిందీలో రీమేక్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయట. అందులో ప్రధానపాత్ర పోషించేందుకు సోనూసూద్ ఆసక్తిగా ఉన్నట్లు చెప్పాడట. అయితే.. దీనికి సంబంధించి ఇప్పటివరకైతే ఎలాంటి అధికారిక ప్రకటనా రాలేదు. కానీ.. ‘క్రాక్’ సినిమాలో రవితేజ చేసిన పోలీస్ పాత్ర నచ్చడంతో ఈ సినిమాను ఎలాగైనా హిందీలో రీమేక్ చేయాలని సోనూ భావిస్తున్నట్లు సమాచారం. ఇటీవల.. ‘ఇక నేను విలన్ పాత్రలు చేయను.. హీరోగా చేయాలనుకుంటున్నా’ అని సోనూసూద్ చేసిన వ్యాఖ్యలు ఇందుకు బలం చేకూరుస్తున్నాయి.
మాస్‌మహారాజ్ రవితేజ, డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్లో వచ్చిన ‘క్రాక్’ మంచి విజయం సాధించింది. ఈ సినిమా జనవరి 9న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శృతిహాసన్ కథానాయిక. సముద్రకని, వరలక్ష్మీశరత్‌కుమార్ కీలక పాత్రల్లో నటించారు. తమన్ సంగీతం అందించాడు. మధు నిర్మాత. ఇటీవల చిత్రబృందం విశాఖపట్నంలో విజయోత్సవ సభ కూడా చేసింది.
ఇదీ చదవండి..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ముందు మీరు రాయ్‌బరేలీలో గెలవండి.. రాహుల్‌కు సలహా ఇచ్చిన చెస్ దిగ్గజం
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (04/05/24)
-
పాలస్తీనా మద్దతుదారులకు హిమ్స్ సంస్థ సీఈఓ గుడ్‌న్యూస్
-
‘తుపాకీతో బెదిరించి.. అత్యాచారం చేసి..’ - ప్రజ్వల్‌పై మహిళ ఫిర్యాదు
-
అషు ‘సూపర్ డీలక్స్ బాడీ’.. సాగరకన్యలా నోరా ఫతేహి!
-
3 నెలల్లో 2 కోట్ల ఖాతాలపై వాట్సప్ నిషేధం