Kotha Bangaru Lokam: ‘కొత్త బంగారులోకం’.. ఆ హీరోలు చేయాల్సింది కానీ!

వరుణ్‌ సందేశ్‌, శ్వేతా బసూప్రసాద్‌ జంటగా దర్శకుడు శ్రీకాంత్‌ అడ్డాల తెరకెక్కించిన చిత్రం ‘కొత్త బంగారులోకం’. ఈ సినిమాలో నటించే అవకాశాన్ని మిస్‌ చేసుకున్న హీరోలెవరంటే?

Published : 09 Oct 2023 19:58 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘కొత్త బంగారులోకం’ (Kotha Bangaru Lokam).. టాలీవుడ్‌లో ఓ ట్రెండ్‌ సెట్‌ చేసింది. ఈ సినిమా కథ, పాటలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. కాలేజీ, హాస్టల్‌ నేపథ్యంలోని సన్నివేశాలకు కుర్రకారు ఫిదా అయిపోయారు. ‘ఎ.. క..డ? వెరైటీ కదా!’ అంటూ హీరోయిన్‌ శ్వేతా బసూ ప్రసాద్‌ చేసిన సందడి అంతా ఇంతా కాదు. హీరో వరుణ్‌ సందేశ్‌ (Varun Sandesh) చాలామంది అమ్మాయిలకు డ్రీమ్‌బాయ్‌గా మారాడు. ఇదంతా ఇప్పుడెందుకంటారా..? ఎందుకంటే ఈ సినిమా విడుదలై 15 ఏళ్లు పూర్తి చేసుకుంది. 2008 అక్టోబరు 9న ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సందర్భంగా.. ఈ సినిమాని మిస్‌ అయిన హీరోలెవరో చూద్దాం..

పెద్దోడి పాత్రలో పవన్‌కల్యాణ్‌..

‘ఆర్య’, ‘బొమ్మరిల్లు’ తదితర చిత్రాలకు అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేసిన శ్రీకాంత్‌ అడ్డాల (Srikanth Addala) ‘కొత్త బంగారులోకం’ కథతో దర్శకుడిగా మారాలనుకున్నారు. అందులోని హీరో పాత్రకు స్టార్‌నికాకుండా కొత్త నటుడిని తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. ప్రముఖ హీరో అక్కినేని నాగార్జున (Nagarjuna) తనయుడు నాగచైతన్య (Naga Chaitanya) తెరంగేట్రం చేసేందుకు సిద్ధంగా ఉన్నారనే సంగతి తెలుసుకున్న శ్రీకాంత్‌.. నాగార్జునను సంప్రదించారు. కథ విన్న నాగార్జున యాక్షన్‌ నేపథ్యం ఉంటే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం చేసి, తిరస్కరించారు. తర్వాత అదే స్టోరీతో రామ్‌ పోతినేని (Ram Pothineni) దగ్గరకు వెళ్లారు శ్రీకాంత్‌. హీరోది ఇంటర్‌ స్టూడెంట్‌ రోల్‌కావడంతో అది తనకు సెట్‌కాదని భావించిన రామ్‌ నో చెప్పారు. మరో హీరో కోసం అన్వేషణ సాగిస్తుండగా ‘హ్యాపీడేస్‌’ సినిమా ఫ్రెష్‌గా ఉందని, అందులోని ఓ కుర్రాడు బాగున్నాడని ఎడిటర్‌ మార్తాండ్‌ కె. వెంకటేశ్‌.. శ్రీకాంత్‌కి సలహా ఇచ్చారు. ఆ మేరకు ‘హ్యాపీడేస్‌’ చూసిన శ్రీకాంత్‌, నిర్మాత దిల్‌రాజు వరుణ్‌ సందేశ్‌ని తమ ప్రాజెక్టులోకి తీసుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని