sitamma vakitlo sirimalle chettu: పెద్దోడి పాత్రలో పవన్‌కల్యాణ్‌..

‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’లో వెంకటేశ్‌ పోషించిన పెద్దోడు పాత్రకు పవన్‌కల్యాణ్‌ను అనుకున్నారట దర్శకుడు శ్రీకాంత్‌ అడ్డాల.

Published : 27 Sep 2023 02:05 IST

హైదరాబాద్‌: వెంకటేశ్‌, మహేశ్‌బాబు కీలక పాత్రల్లో శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కిన మల్టీస్టారర్‌ ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’(Seethamma Vakitlo Sirimalle Chettu). 2013లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయాన్ని అందుకోవడమే కాకుండా, మల్టీస్టారర్‌ మూవీలకు మళ్లీ పునాదులు వేసింది. అయితే, తొలుత ఈ సినిమాలో పెద్దోడు, చిన్నోడి పాత్రల కోసం పవన్‌కల్యాణ్‌, మహేశ్‌బాబులను అనుకున్నారట. తాజాగా ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు.

శ్రీకాంత్‌ అడ్డాల స్వీయ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘పెదకాపు-1’. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా సెప్టెంబరు 29న విడుదల కానుంది. సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొన్న ఆయన్ను ‘పవన్‌కల్యాణ్‌తో సినిమా అనుకుని ఎందుకు తీయలేదు’ అని ప్రశ్నించగా, ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మూవీలో పెద్దోడి పాత్ర కోసం పవన్‌ను అనుకున్నా. కానీ, కుదరలేదు. ఆ తర్వాత కాంబినేషన్స్‌ మారిపోయాయి’ అని చెప్పారు. అయితే, అప్పట్లో మరో టాక్‌ కూడా నడిచింది. వెంకటేశ్‌, పవన్‌ కలిసి ఆ సినిమా చేస్తారని అన్నారు. అయితే, వాళ్లిద్దరూ కలిసి ‘గోపాల గోపాల’లో నటించారు. ఇక పవన్‌ ‘జల్సా’ మూవీకి మహేశ్‌బాబు వాయిస్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని