New Jersey: ‘ఎన్‌ఆర్‌ఐలు ఏపీలో పెట్టుబడులు పెట్టాలి’: మన్నవ మోహన కృష్ణ

Eenadu icon
By Nri News Team Published : 29 Oct 2025 00:54 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

ఏపీటీఎస్ చైర్మన్ మన్నవ మోహన కృష్ణ

ఇంటర్నెట్‌ డెస్క్‌: అమెరికాలోని న్యూజెర్సీలో జరిగిన ‘మీట్ విత్ మన్నవ మోహన కృష్ణ’ కార్యక్రమంలో ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ (APTS) ఛైర్మన్ మన్నవ మోహన కృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏపీ అభివృద్ధి పునరుద్ధరణ దిశగా సీఎం చంద్రబాబు నాయుడు చూపిస్తున్న నాయకత్వం దేశవ్యాప్తంగా ఆదర్శంగా నిలుస్తోందన్నారు. రాష్ట్రాన్ని సాంకేతికత, పారిశ్రామిక, ఇన్నోవేషన్ కేంద్రంగా మార్చేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఆయన ప్రశంసించారు. కూటమి ప్రభుత్వం దూరదృష్టితో ఏపీ కొత్త దిశగా పయనిస్తోందన్నారు. గూగుల్‌తో ఒప్పందం, క్వాంటం వ్యాలీ ప్రాజెక్ట్‌లు రాష్ట్రాన్ని ప్రపంచ సాంకేతిక కేంద్రంగా నిలబెడతాయని పేర్కొన్నారు.

ఎన్‌ఆర్‌ఐలు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. పరిశ్రమలు స్థాపించి, పెట్టుబడులు పెట్టి, టెక్నాలజీని రాష్ట్రానికి తీసుకురావాలని కోరారు. ఏపీ అభివృద్ధిలో ప్రవాసాంధ్రుల పాత్ర ఎంతో కీలకమన్నారు. మీ పెట్టుబడులు, మీ సహకారం ఆంధ్రప్రదేశ్‌ను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లగలవని పేర్కొన్నారు. పెట్టుబడులు పెట్టి రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలని కోరారు. అనంతరం ఎన్‌ఆర్‌ఐలు మన్నవ మోహన కృష్ణని సత్కరించారు. ఏపీలోని అభివృద్ధి రంగాలపై విస్తృతంగా చర్చించారు. ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిన ఎన్‌ఆర్‌ఐలులు మోహన కృష్ణతో పలు అంశాలపై చర్చించారు. కార్యక్రమంలో ప్రవాసాంధ్రులు, వ్యాపారవేత్తలు, అమెరికా తెదేపా నాయకులు, స్థానిక తెలుగు సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు