AP High Court: వైకాపా ఎమ్మెల్యేల పిటిషన్‌పై విచారణ వాయిదా

వైకాపా ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటిషన్‌పై ఏపీ హైకోర్టు విచారణ వాయిదా వేసింది.

Published : 29 Jan 2024 20:05 IST

అమరావతి: వైకాపా ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటిషన్‌పై ఏపీ హైకోర్టు విచారణ వాయిదా వేసింది. శాసనసభ సభ్యత్వం ఎందుకు రద్దు చేయకూడదో వివరణ ఇవ్వాలంటూ అసెంబ్లీ స్పీకర్‌ జారీ చేసిన నోటీసులను సవాల్‌ చేస్తూ ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి, ఆనం రామనారాయణ, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి హైకోర్టులో లంచ్‌ మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. మండలి ఛైర్మన్‌ జారీ చేసిన నోటీసులను ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య ఉన్నత న్యాయస్థానంలో సవాల్‌ చేశారు. వీటిపై సోమవారం వాదనలు కొనసాగాయి. ధర్మాసనం స్పందిస్తూ.. ఈ దశలో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశించిన కోర్టు.. తదుపరి విచారణను వాయిదా వేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని