KTR: కాంగ్రెస్ కావాలో.. కరెంటు కావాలో ప్రజలు ఆలోచించాలి: మంత్రి కేటీఆర్‌

కాంగ్రెస్ కావాలో.. కరెంటు కావాలో ప్రజలు ఆలోచించాలని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Published : 08 Nov 2023 20:04 IST

సంగారెడ్డి: కాంగ్రెస్ కావాలో.. కరెంటు కావాలో ప్రజలు ఆలోచించాలని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్‌ పాలన అంటే కరెంటు ఖతమేనని ఎద్దేవా చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సంగారెడ్డిలోని గంజ్‌ మైదానంలో నిర్వహించిన విద్యార్థి యువ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న కేటీఆర్‌.. భారాస అభ్యర్థి చింతా ప్రభాకర్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. కాంగ్రెస్‌కు గతంలో 11 ఛాన్సులు ఇస్తే.. ఏం చేసిందని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ నేతలు ఏ ముఖం పెట్టుకుని ఓటు అడుగుతున్నారని నిలదీశారు. కర్ణాటకలో కాంగ్రెస్‌ను గెలిపించినందుకు అక్కడి రైతులు కరెంటు కష్టాలు ఎదుర్కొంటున్నారన్నారు. కరెంట్‌ కోసం రైతులు విద్యుత్‌ స్టేషన్లలో మొసళ్లు వదిలే పరిస్థితి ఏర్పడిందన్నారు. 55 ఏళ్లు అధికారంలో ఉండి ఏమీ చేయలేకపోయిన కాంగ్రెస్‌ నేతలు.. మళ్లీ ఉద్దరిస్తామని తిరుగుతున్నారని కేటీఆర్‌ విమర్శించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని