Pawan Kalyan: పవన్‌ కల్యాణ్‌పై క్రిమినల్ డిఫమేషన్ పిటిషన్

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై క్రిమినల్ డిఫమేషన్ పిటిషన్ దాఖలైంది.

Published : 24 Jul 2023 19:41 IST

విజయవాడ: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై క్రిమినల్ డిఫమేషన్ పిటిషన్ దాఖలైంది. విజయవాడ సిటీ సివిల్ కోర్టులో ఓ మహిళా వాలంటీర్ పిటిషన్‌ దాఖలు చేశారు. ఏలూరులో నిర్వహించిన వారాహి యాత్ర సభలో వాలంటీర్లపై పవన్ కల్యాణ్‌ చేసిన వ్యాఖ్యలు మానసికంగా ఇబ్బందికి గురి చేశాయని పిటిషన్‌లో వివరించారు. ఎలాంటి ఆధారాలు లేకుండా పవన్‌ కల్యాణ్‌ వాలంటీర్లపై ఆరోపణలు చేశారని పిటిషనర్‌ పేర్కొ్న్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని