బెంగాల్‌: అఖిలపక్ష భేటీకి ఈసీ పిలుపు

కోల్‌కతా: బెంగాల్‌ శాసనసభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని కొవిడ్‌ ఉద్ధృతిపై కోల్‌కతా హైకోర్టు మంగళవారం ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో.. ఎన్నికల కమిషన్‌ చర్యలకు ఉపక్రమించింది. బుధవారం అన్ని రాజకీయ పార్టీలతో అఖిలపక్ష భేటీకి ఈసీ పిలుపునిచ్చింది. శుక్రవారం ఈ మేరకు సమావేశం జరగనుండగా..

Published : 14 Apr 2021 22:14 IST

కోల్‌కతా: బెంగాల్‌ శాసనసభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని కొవిడ్‌ ఉద్ధృతిపై కలకత్తా హైకోర్టు మంగళవారం ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో.. కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) చర్యలకు ఉపక్రమించింది. బుధవారం అన్ని రాజకీయ పార్టీలతో అఖిలపక్ష భేటీకి ఈసీ పిలుపునిచ్చింది. శుక్రవారం సమావేశం జరగనుండగా.. దీనికి అన్ని రాజకీయ పార్టీల అభ్యర్థులు, నేతలు హాజరుకానున్నారు. వైరస్‌ వ్యాప్తిని దృష్టిలో ఉంచుకొని బెంగాల్‌ ఎన్నికల ప్రచారంలో తీసుకోవాల్సిన కరోనా జాగ్రతలపై ఈ భేటీలో ప్రధానంగా చర్చించనున్నారు. మిగిలిన దశల ఎన్నికలకు సంబంధించి అన్ని పార్టీలకు కొవిడ్‌ నిబంధనలపై ఈసీ కఠిన మార్గదర్శకాలు జారీ చేయనున్నట్లు తెలుస్తోంది. వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో బెంగాల్‌ ఎన్నికల ప్రచారంలో కఠిన మార్గదర్శకాలు అమలు చేయాలని కలకత్తా హైకోర్టు మంగళవారం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని