Gudivada Amarnath: గాజువాకలో అమర్‌నాథ్‌కు ఝలక్‌

విశాఖ జిల్లా గాజువాక వైకాపా అభ్యర్థిగా బరిలో నిలుస్తున్న మంత్రి అమర్‌నాథ్‌కు పార్టీశ్రేణుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఆదివారం ఆయన గాజువాకలో తొలిసారిగా పార్టీశ్రేణులతో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు.

Updated : 18 Mar 2024 06:48 IST

తొలి ఆత్మీయ సమావేశానికి ఎమ్మెల్యే, కార్పొరేటర్ల డుమ్మా

విశాఖపట్నం (గాజువాక), న్యూస్‌టుడే: విశాఖ జిల్లా గాజువాక వైకాపా అభ్యర్థిగా బరిలో నిలుస్తున్న మంత్రి అమర్‌నాథ్‌కు పార్టీశ్రేణుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఆదివారం ఆయన గాజువాకలో తొలిసారిగా పార్టీశ్రేణులతో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశానికి ప్రస్తుత ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, ఇటీవల వరకు ఇన్‌ఛార్జిగా పని చేసిన కార్పొరేటరు ఉరుకూటి రామచంద్రరావు(చందు), మరికొందరు గైర్హాజరయ్యారు. కార్యక్రమానికి హాజరైన 73వ వార్డు కార్పొరేటరు భూపతిరాజు సుజాత, డీసీఎంఎస్‌ మాజీ ఛైర్‌పర్సన్‌ పల్లా చినతల్లి, ఇతర నాయకులు, కార్యకర్తలు వివిధ అంశాలపై మంత్రి అమర్‌నాథ్‌ను నిలదీశారు. పార్టీ ఆదేశాల మేరకు అందరూ సహకరించాలంటూ మంత్రి తన ప్రసంగం ముగించారు. మంత్రి అమర్‌నాథ్‌ను గాజువాక అభ్యర్థిగా ఎంపిక చేసినప్పట్నుంచి పార్టీలో విభేదాలు తారస్థాయికి చేరాయి. ఇన్‌ఛార్జి పదవి నుంచి తొలగించడంతో ఉరుకూటి చందు అసంతృప్తితో ఉన్నారు. ఎమ్మెల్యే నాగిరెడ్డి తనకు అనారోగ్యంగా ఉందంటూ ముఖం చాటేశారు. తొలినుంచీ గాజువాక ఇన్‌ఛార్జిగా పనిచేసిన ఎమ్మెల్యే తనయుడు తిప్పల దేవన్‌రెడ్డిని తప్పించడంతో ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. అయితే ఆదివారం ఆయన మంత్రి సమావేశానికి హాజరై, అధ్యక్షత కూడా వహించారు. మాజీ ఎమ్మెల్యేలు తిప్పల గురుమూర్తిరెడ్డి, చింతలపూడి వెంకట్రామయ్య పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని