ప్రధాని మోదీపై ఈసీకి ఫిర్యాదు: నిరంజన్‌

ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించారని ఎన్నికల కమిషన్‌కు లేఖ ద్వారా ఫిర్యాదు చేసినట్లు పీసీసీ సీనియర్‌ ఉపాధ్యక్షుడు జి.నిరంజన్‌ తెలిపారు.

Published : 19 Apr 2024 04:16 IST

హైదరాబాద్‌, న్యూస్‌టుడే: ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించారని ఎన్నికల కమిషన్‌కు లేఖ ద్వారా ఫిర్యాదు చేసినట్లు పీసీసీ సీనియర్‌ ఉపాధ్యక్షుడు జి.నిరంజన్‌ తెలిపారు. ఆయన గురువారం గాంధీభవన్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అస్సాంలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ప్రధాని మోదీ అయోధ్య మందిరంలో జరుగుతున్న ఘట్టం గురించి మాట్లాడటం ద్వారా ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించారని పేర్కొన్నారు. దీనిపై పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని కోరినట్లు తెలిపారు. మరోవైపు ఎన్నికల నోటిఫికేషన్‌కు ఒక రోజు ముందు జీహెచ్‌ఎంసీలో 5.4లక్షల ఓట్లు తొలగించామని ఈసీ చెప్పడం ఆశ్చర్యంగా ఉందన్నారు. ఏదైనా గందరగోళం జరిగితే ఈసీనే బాధ్యత వహించాల్సి వస్తుందని ఆయన స్పష్టం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని