Harish rao: మొద్దు ప్రభుత్వాన్ని నిద్ర లేపడానికే రైతు దీక్షలు: హరీశ్‌రావు

మొద్దు ప్రభుత్వాన్ని నిద్ర లేపడానికే రైతు దీక్షలు చేస్తున్నామని మాజీ మంత్రి , సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు.

Updated : 06 Apr 2024 16:13 IST

సంగారెడ్డి: మొద్దు ప్రభుత్వాన్ని నిద్ర లేపడానికే రైతు దీక్షలు చేస్తున్నామని మాజీ మంత్రి , సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. సంగారెడ్డిలో నిర్వహించిన భారాస రైతు దీక్షలో ఆయన మాట్లాడారు. వంద రోజుల కాంగ్రెస్‌ పాలనలో 200 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. ‘‘కరెంట్‌ లేదు, నీళ్లు లేవు, కన్నీళ్లే మిగిలాయి. పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.25 వేలు ఇవ్వాలి. చనిపోయిన అన్నదాతల కుటుంబాలకు రూ.20 లక్షలు ఇవ్వాలి. రైతులకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలి. రైతుబంధు రూ.15 వేలు, రైతు కూలీలకు రూ.12 వేలు ఇవ్వాలి. వరి పండించిన రైతులకు రూ.500 బోనస్‌ అందించాలి’’ అని హరీశ్‌రావు డిమాండ్‌ చేశారు. రైతులకు మేలు చేసే వరకు భారాస పోరాడుతుందన్నారు.

వడ్డీతో సహా చెల్లిస్తాం..

మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వ్యాఖ్యలకు హరీశ్‌రావు కౌంటర్‌ ఇచ్చారు. వేరే పార్టీల ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లో చేర్చుకోబోమని ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌ చెబుతుంటే.. ఉత్తమ్‌ మాత్రం భిన్నంగా మాట్లాడుతున్నారని అన్నారు. ‘‘ మా పార్టీకి చెందిన 25 మంది కాంగ్రెస్‌లోకి చేరుతున్నట్లు ఉత్తమ్‌ చెబుతున్నారు. కాంగ్రెస్‌ నేతలు హామీలు అమలు చేసేదాకా వదిలిపెట్టం. కేసీఆర్‌పై మంత్రులు ఇష్టారీతిన మాట్లాడుతున్నారు. రైతు సమస్యలపై మాట్లాడిన ఆయన్ని తిడుతున్నారు. కేసీఆర్‌ ప్రజల్లోకి వెళ్తే.. వాళ్లకు నిద్ర పట్టడం లేదు. ఐదేళ్ల తర్వాత మళ్లీ కాంగ్రెస్‌ అధికారంలోకి రాదు. ఎన్ని చేయాలో చేయండి.. వడ్డీతో సహా చెల్లిస్తాం’’ అని హరీశ్‌రావు అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని