Priyanka: మళ్లీ అధికారంలోకి వస్తే కులగణన చేపడతాం: ప్రియాంక హామీ

ఛత్తీస్‌గఢ్‌లో తిరిగి కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వస్తే పేదలకు 10లక్షల ఇళ్లు ఇవ్వడంతో పాటు కులగణన చేపడతామని కాంగ్రెస్‌ నేత ప్రియాంకా గాంధీ హామీ ఇచ్చారు.

Published : 06 Oct 2023 16:41 IST

కాంకేర్‌: ఛత్తీస్‌గఢ్‌లో వరుసగా రెండోసారి కాంగ్రెస్‌ (Congress) అధికారంలోకి వస్తే రాష్ట్రంలో కులగణన చేపడతామని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా (Priyanka Gandhi vadra)అన్నారు. ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్‌లో జరిగిన మున్సిపల్, పంచాయతీరాజ్ మహా సమ్మేళనంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన భారీ బహిరంగ సభలో ప్రియాంక మాట్లాడుతూ.. కేంద్రంలోని భాజపా ప్రభుత్వం ధనికులదేనని.. పేదలు, మధ్య తరగతి ప్రజల సమస్యలు మాత్రం పట్టవని మండిపడ్డారు. దాదాపు ఐదేళ్ల క్రితం కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక ఛత్తీస్‌గఢ్‌ను హింసాకాండ బారి నుంచి విముక్తి కలిగించామన్నారు. 

ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన హామీలు కేవలం బూటకపు వాగ్దానాలేనని ప్రియాంక మండిపడ్డారు. దేశంలోని ప్రతి పౌరుడి ఖాతాలో రూ.15లక్షలు వేస్తామన్న హామీ ఏమైంది? కోట్లాది ఉద్యోగాలు ఇస్తామన్నారు ఏమయ్యాయి? అని ప్రశ్నించారు. దేశంలోని నరేంద్ర మోదీ సర్కార్‌ రైతులను నిర్వీర్యం చేసిందని ఆరోపించారు. రైతులు రోజుకు రూ.27 సంపాదిస్తున్నారని..  అదానీ వంటి పారిశ్రామికవేత్తలు మాత్రం రోజుకు రూ.1600 కోట్లు సంపాదిస్తున్నారని ఆరోపించారు. దేశంలోని ప్రజాధనాన్ని వ్యాపారవేత్తలైన తన మిత్రులకు అప్పగించి.. ఆ తర్వాత వారి ద్వారా వాటిని పార్టీకి మళ్లిస్తున్నారని.. ఆ ధనాన్నే తిరిగి ఎన్నికల్లో ఖర్చు చేస్తున్నారని ప్రియాంక ఆరోపించారు. భాజపా లక్ష్యం అధికారంలో కొనసాగడమే తప్ప ప్రజల సంక్షేమం కాదని విమర్శించారు. 

కేసీఆర్‌కు ఒక సందేశం ఇస్తున్నా.. వచ్చే ఎన్నికల్లో అన్నీ ముగిసిపోతాయి: జేపీ నడ్డా

రాష్ట్రంలో కాగ్రెస్‌ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తే పేదలకు 10లక్షల ఇళ్లు ఇస్తామని ఈ సందర్భంగా ప్రియాంకా గాంధీ హామీ ఇచ్చారు.  మన పంచాయతీలు, పట్టణ సంస్థలు అభివృద్ధికి మూలస్తంభాలని పేర్కొన్నారు. పంచాయితీ రాజ్‌ను అమలు చేసి కాంగ్రెస్‌.. ప్రజలకు అధికారాన్ని అప్పగించిందని గుర్తు చేశారు. నేడు ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం పంచాయతీలను బలోపేతం చేయడం ద్వారా అద్భుతమైన అభివృద్ధి నమూనాను అందించిదని  ప్రియాంక ప్రశంసించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని