Shashi Tharoor: భాజపాకు 50 సీట్లు తగ్గొచ్చు.. విపక్షాల గురించి ఆ మాట చెప్పడం కష్టమే..!

2024 ఎన్నికల్లో భాజపా 2019 స్థాయి విజయం దక్కించుకోలేకపోవచ్చని కాంగ్రెస్ నేత శశిథరూర్(Shashi Tharoor) అన్నారు. అలాగే వారసత్వ రాజకీయాల గురించి మాట్లాడారు. 

Updated : 14 Jan 2023 14:56 IST

కొళికోడ్‌: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (BJP) 2019లో సాధించిన విజయాన్ని పునరావృతం చేయడం అసాధ్యమేనని కాంగ్రెస్(Congress) సీనియర్ నేత శశిథరూర్( Shashi Tharoor) అన్నారు. గతంతో పోలిస్తే 50 సీట్లను కోల్పోవచ్చని అంచనా వేశారు. కేరళలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ఈ అభిప్రాయం వ్యక్తం చేశారు.

‘2019లో భాజపా సాధించిన విజయం.. 2024లో పునరావృతం కాకపోవచ్చు. అలాగే వచ్చే ఎన్నికల్లో మెజార్టీ మార్కుకంటే దిగువకు పడిపోవడం కూడా అసాధ్యమేమీ కాదు’ అని థరూర్ వ్యాఖ్యానించారు. అలాగే పుల్వామా, బాలాకోట్ దాడులు చివరి నిమిషంలో ప్రభావం చూపాయని, రానున్న ఎన్నికల్లో ఇలాంటివి రిపీట్ కావని వెల్లడించారు. కమలం పార్టీ 50 సీట్లు కోల్పోవడమనేది ఊహించదగినదే అని అన్నారు. అది ప్రతిపక్షాలకు లాభదాయకంగా మారొచ్చన్నారు. అయితే ఆ సమయంలో విపక్షపార్టీలు కలిసికట్టుగా ముందుకు సాగుతాయా..? అనేది చెప్పడం కష్టమేనని అభిప్రాయపడ్డారు.  2019 ఎన్నికల్లో భాజపా మూడు వందలకు పైగా సీట్లు దక్కించుకుంది.

అలాగే ఆయన వారసత్వ రాజకీయాలపైనా స్పందించారు. ‘మనం కాంగ్రెస్ వారసత్వ రాజకీయాల గురించి మాట్లాడేప్పుడు.. దేశం మొత్తం ఉన్న రాజకీయపార్టీల గురించి కూడా గమనించాలి. ములాయం సింగ్ యాదవ్, లాలూ ప్రసాద్ యాదవ్, కరుణానిధి, బాల్‌ ఠాక్రే, శరద్ పవార్ పార్టీల్లో వారి తర్వాతి తరం రాజకీయాల్లో ఉంది’ అని వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని