PM Modi: మోదీతో దీదీ భేటీ.. ప్రొటోకాల్‌ ప్రకారమే కలిశానని వ్యాఖ్య

ప్రధాని నరేంద్ర మోదీతో బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కోల్‌కతాలో సమావేశమయ్యారు.

Published : 01 Mar 2024 20:13 IST

కోల్‌కతా: ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi)తో పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి, తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) సమావేశమయ్యారు. రెండు రోజుల పర్యటన కోసం రాష్ట్రానికి వచ్చిన ప్రధాని శుక్రవారం రాత్రికి రాజ్‌భవన్‌లోనే ఉండనున్నారు. ఈనేపథ్యంలో సీఎం మమత, ప్రధానితో సమావేశమయ్యారు. గతేడాది డిసెంబర్‌లో తమ రాష్ట్రానికి రావాల్సిన బకాయిలను విడుదల చేయాలని కోరుతూ దిల్లీలో కలిసిన తర్వాత మళ్లీ ప్రధాని మోదీని కలవడం ఇదే తొలిసారి.

మోదీతో భేటీ అనంతరం మమత మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. రాష్ట్రపతి లేదా ప్రధానమంత్రి రాష్ట్రాన్ని సందర్శిస్తే సీఎం వెళ్లి వారిని కలవడం ఓ ప్రొటోకాల్‌ అన్నారు. ఇది మర్యాదపూర్వక భేటీయేనని.. రాజకీయ అంశాలేవీ చర్చించలేదన్నారు. ఎందుకంటే ఇది రాజకీయ సమావేశం కాదని చెప్పారు.  ఇదిలాఉండగా.. తమ రాష్ట్రానికి కేంద్రం నుంచి రూ.1.18లక్షల కోట్ల బకాయిలు రావాలని తృణమూల్‌ కాంగ్రెస్‌ నేతలు చెబుతున్నారు. 2022 మార్చి నుంచి పెండింగ్‌లో ఉన్న దాదాపు 30 లక్షల మంది నరేగా కార్మికులకు ₹2,700 కోట్ల బకాయిల చెల్లింపును రాష్ట్ర ప్రభుత్వం సోమవారమే ప్రారంభించింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని