Politics: ‘ఎన్డీయే’ను వీడి.. మరెక్కడికీ వెళ్లే ప్రసక్తే లేదు..: నీతీశ్‌ కుమార్‌

ఎన్డీయే కూటమితో మళ్లీ జట్టుకట్టిన బిహార్‌ సీఎం నీతీశ్‌ కుమార్‌.. మరెక్కడికీ వెళ్లే ప్రశ్నే లేదని పేర్కొన్నారు.

Updated : 28 Jan 2024 22:47 IST

పట్నా: భాజపా ఆధ్వర్యంలోని ఎన్డీయే (NDA) కూటమిని వీడి మరెక్కడికీ వెళ్లే ప్రసక్తే లేదని బిహార్‌ సీఎం, జేడీయూ (JDU) అధినేత నీతీశ్‌ కుమార్‌ (Nitish Kumar) తెలిపారు. భాజపాతో జట్టు కట్టి, కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఆయన.. రికార్డు స్థాయిలో తొమ్మిదోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

బిహార్‌ సీఎంగా తొమ్మిదోసారి.. నీతీశ్‌ రాజకీయ ప్రస్థానమిదీ

‘‘నేను గతంలో కూడా ఎన్డీయేతో ఉన్నా. అయితే.. దారులు వేరయ్యాయి. ఇప్పుడు కలిశాం. ఇలాగే ఉంటాం. గతంలో ఉన్న చోటికే (ఎన్డీయే) తిరిగి వచ్చాను. ఇప్పుడు ఎక్కడికీ వెళ్లే ప్రశ్నే లేదు’’ అని నీతీశ్‌ పేర్కొన్నారు. మంత్రులుగా మొత్తం ఎనిమిది మంది ప్రమాణ స్వీకారం చేశారని చెప్పారు. మిగిలిన వారి పేర్లను త్వరలో నిర్ణయిస్తామన్నారు. బిహార్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నట్లు స్పష్టం చేశారు.

మమతతో కలిసి కాంగ్రెస్‌ కుట్ర: కేసీ త్యాగి

‘ఇండియా’ కూటమి నాయకత్వాన్ని హైజాక్‌ చేసేందుకు కాంగ్రెస్‌ యత్నిస్తోందని, దీని కోసం టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీతో కలిసి కుట్ర పన్నిందని జేడీయూ అధికార ప్రతినిధి కేసీ త్యాగి ఆరోపించారు. కుట్రపూరితంగా మల్లికార్జున ఖర్గే పేరును ప్రధాని పదవికి ప్రతిపాదించినట్లు పేర్కొన్నారు. కూటమిలోని ఇతర పార్టీలన్నీ కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పోరాడినవేనని చెప్పారు. భాజపాను ఢీకొనేందుకు ‘ఇండియా’ వద్ద ఎటువంటి ప్రణాళికలు లేవన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని