BJP: ‘విపక్ష కూటమి త్వరలో కూలిపోతుంది’: భాజపా

తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ(Mamata Banerjee) తీసుకున్న నిర్ణయం కాంగ్రెస్‌కు గట్టి ఎదురుదెబ్బ అని భాజపా వ్యాఖ్యానించింది. 

Updated : 24 Jan 2024 18:48 IST

కోల్‌కతా: లోక్‌సభ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్‌లో ఒంటరిగా పోటీ చేస్తామని ప్రకటించి కాంగ్రెస్‌(Congress)కు మమతా బెనర్జీ(Mamata Banerjee) పార్టీ తృణమూల్ కాంగ్రెస్‌ షాకిచ్చింది. దీనిపై భాజపా స్పందించింది. ‘ఇండియా’ కూటమి అసహజమైనదని, అది త్వరలోనే కూలిపోతుందని కేంద్రమంత్రులు, కమలం పార్టీ నేతలు వ్యాఖ్యలు చేశారు.

‘ఆ కూటమి అసహజమైనది. ఎందుకంటే బెంగాల్‌లో కాంగ్రెస్‌, సీపీఎం.. తృణమూల్‌కు వ్యతిరేకంగా పోటీ చేస్తున్నాయి. గతంలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో టీఎంసీ కార్యకర్తలు.. ఆ పార్టీల కార్యకర్తలపై దాడి చేశారు. మమతాజీకి గ్రౌండ్ రిపోర్టుపై అవగాహన ఉంది. ఆమె నిర్ణయం కాంగ్రెస్‌కు గట్టి ఎదురుదెబ్బ. మమత, నీతీశ్‌ కుమార్‌, అఖిలేశ్‌ యాదవ్‌ వంటి నేతలు లేకుండా ఆ కూటమి మనుగడ ఎలా సాధిస్తుంది..?’ అంటూ కాంగ్రెస్‌ను విమర్శించారు.

కేంద్రంలోని అధికార ఎన్డీయే (NDA)పై ఉమ్మడి పోరు కోసం జట్టుగా ఏర్పడిన విపక్షాల ‘ఇండియా (INDIA Bloc)’ కూటమి బీటలు వారుతున్నట్లు కనిపిస్తోంది. మమత ప్రకటన తర్వాత.. ఆప్‌ నుంచి ఇదే తరహా స్పందన వచ్చింది. పంజాబ్‌లో తాము ఒంటరిగా పోటీ చేస్తామని వెల్లడించింది. రాజకీయ కూటమిలో సీట్ల పంపకం అనేది సవాలేనని ఆమ్‌ఆద్మీ పార్టీ నేత, దిల్లీ మంత్రి సౌరభ్‌ భరద్వాజ్‌ పేర్కొన్నారు. విపక్ష పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు కుదరకపోవడం వల్లే ఈ ప్రకటనలు వెలువడుతున్నట్లు తెలుస్తోంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని