పాలేరు కాదు.. షర్మిల ముందు అమరావతి రైతుల గురించి మాట్లాడాలి: రేణుకా చౌదరి

పాలేరు (Paleru)లో వైతెపా అధ్యక్షురాలు షర్మిల (YS Sharmila) పోటీ చేయనున్నట్లు జరుగుతున్న ప్రచారంపై కాంగ్రెస్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి (Renuka Chowdhury) తీవ్రంగా స్పందించారు.

Updated : 03 Sep 2023 22:02 IST

హైదరాబాద్‌: పాలేరు (Paleru)లో వైతెపా అధ్యక్షురాలు షర్మిల (YS Sharmila) పోటీ చేయనున్నట్లు జరుగుతున్న ప్రచారంపై కాంగ్రెస్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి (Renuka Chowdhury) తీవ్రంగా స్పందించారు. షర్మిల ముందు అమరావతిలో రైతుల గురించి మాట్లాడాలని సూచించారు. హైదరాబాద్‌లోని గాంధీభవన్‌ వద్ద ఈ మేరకు ఆమె మాట్లాడారు.

తెలంగాణ కోడలన్న విషయం షర్మిలకు ఇప్పుడు గుర్తు వచ్చిందా? అని ప్రశ్నించారు. తెలంగాణలో షర్మిల ఎంతనో.. ఏపీలో తాను కూడా అంతేనని రేణుకా చౌదరి వ్యాఖ్యానించారు. తాను ఏపీ కోడల్ని అన్న ఆమె.. తెలంగాణ బిడ్డనని గుర్తు చేశారు. తెలంగాణలో షర్మిల పోటీ చేసే విషయమై అధిష్ఠానం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. షర్మిల విషయంలో అధిష్ఠానం స్పష్టమైన నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నట్లు చెప్పారు. పాలేరులో పోటీ చేయడానికి ఇంకా ఎవరైనా మిగిలి ఉన్నారా? అంటూ సెటైర్లు వేశారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని