Lokesh: రాజమహేంద్రవరంలో లోకేశ్‌కు ఘనస్వాగతం.. పాదయాత్రకు సర్వం సిద్ధం

సోమవారం నుంచి తిరిగి ప్రారంభం కానున్న తెలుగుదేశంపార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ యువగళం పాదయాత్రకు సర్వం సిద్ధమైంది.

Published : 26 Nov 2023 22:32 IST

రాజమహేంద్రవరం: సోమవారం నుంచి తిరిగి ప్రారంభం కానున్న తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ యువగళం పాదయాత్రకు సర్వం సిద్ధమైంది. చంద్రబాబు అరెస్టు కారణంగా తాత్కాలిక విరామం ప్రకటించిన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పొదలాడ నుంచే యాత్ర కొనసాగించనున్నారు. ఇందుకోసం హైదరాబాద్‌ నుంచి రాజమహేంద్రవరం విమానాశ్రయానికి చేరుకున్న లోకేశ్‌కు పార్టీ నేతలు ఘన స్వాగతం పలికారు. అనంతరం పార్టీ శ్రేణులతో కలిసి లోకేశ్‌.. రోడ్డు మార్గంలో పొదలాడ యువగళం క్యాంప్‌ సైట్‌కు చేరుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని