AP News:  అమర్‌నాథ్‌రెడ్డి, నానిని అదుపులోకి తీసుకున్న పోలీసులు 

తెదేపా నేతలు అమర్‌నాథ్‌రెడ్డి, పులివర్తి నాని అరెస్టయ్యారు. కుప్పం బీసీఎన్‌ హోటల్‌లో బసచేసిన అమర్‌నాథ్‌రెడ్డి, నానిని పోలీసులు మంగళవారం రాత్రి అరెస్టు చేశారు. సోమవారం(నిన్న) కుప్పం మున్సిపాలిటీ ...

Updated : 10 Nov 2021 06:02 IST

చిత్తూరు: తెదేపా నేతలు అమర్‌నాథ్‌రెడ్డి, పులివర్తి నానిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కుప్పం బీసీఎన్‌ హోటల్‌లో బసచేసిన అమర్‌నాథ్‌రెడ్డి, నానిని పోలీసులు మంగళవారం రాత్రి అరెస్టు చేశారు. సోమవారం(నిన్న) కుప్పం మున్సిపాలిటీ కార్యాలయంపై దాడి చేశారని పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో మొత్తం 19 మంది తెదేపా నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు.  

ఏం జరిగిందంటే.. 

కుప్పం మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించి 14వ వార్డులో పోటీ లేనట్లు కమిషనర్‌ చిట్టిబాబు ఇచ్చిన జాబితా ఉండడంతో, ఇలా ఎందుకు జరిగిందో తెలుసుకోవాలని తెదేపా శ్రేణులు ఆయన కార్యాలయానికి చేరుకున్నారు. ఎంతసేపటికీ కమిషనర్‌ నుంచి సమాధానం రాకపోవడంతో ఒకానొక దశలో వారు గేటును తోసుకుంటూ కార్యాలయ ఆవరణలోకి చేరుకున్నారు. దీంతో పోలీసులు, తెదేపా శ్రేణుల మధ్య తొపులాట జరిగింది. కొందరు నాయకులపై పోలీసులు చేయి చేసుకున్నారు. పోలీసులు తెదేపా నేత అమర్‌నాథ్‌రెడ్డి మెడ పట్టుకొని బయటకు తోశారు. అనంతరం తెదేపా శ్రేణులు రోడ్డుపై బైఠాయించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని