మృత్యువుతో బాలుడి పోరాటం.. కాపాడేందుకు ప్రజల ఆరాటం

కేరళలో ఓ ఏడేళ్ల బాలుడి ప్రాణాలు కాపాడేందుకు వేలాదిమంది ప్రజలు ముందుకొచ్చారు.

Published : 27 Mar 2022 11:17 IST

కేరళలో ఓ ఏడేళ్ల బాలుడి ప్రాణాలు కాపాడేందుకు వేలాదిమంది ప్రజలు ముందుకొచ్చారు. తిరువనంతపురంకు చెందిన ఏడేళ్ల శ్రీనందన్‌ రెండు నెలలుగా బ్లడ్‌ క్యాన్సర్‌తో బాధపడుతున్నాడు. వ్యాధి కారణంగా శరీరంలో రక్తాన్ని ఉత్పత్తి చేసే కణాలు దెబ్బతిన్నాయి. ఫలితంగా రక్తం ఉత్పత్తి నిలిచిపోయింది. శ్రీనందన్‌ను బతికించుకోవాలంటే స్టెమ్‌ సెల్‌ థెరపీ ఒక్కటే మార్గమన్న వైద్యులు బాలుడి రక్త కణాలకు సరిపోయే రక్తంతోనే చికిత్స సాధ్యమని తెలిపారు. బాలుడిని కాపాడేందుకు రక్త దాతల కోసం తిరువనంతపురంలో క్యాంపు ఏర్పాటు చేశారు. సామాజిక మాధ్యమాల ద్వారా బాలుడి ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్న ప్రజలు క్యాంపు వద్దకు తరలివస్తున్నారు. రక్త కణాలు అందించేందుకు పరీక్షలు చేయించుకుంటున్నారు. పరీక్షల కోసం వాలంటీర్ల లాలాజలాన్ని సేకరిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. హెచ్‌ఎల్‌ఏ పరీక్ష ద్వారా బాలుడి చికిత్సకు సరిపోయే రక్త కణాలను గుర్తిస్తామని పేర్కొన్నారు. ఫలితాలు వచ్చేందుకు 45 రోజుల సమయం పడుతుందని వెల్లడించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని