స్మిత్‌కు ఇంకో ఛాన్స్‌ ఎందుకివ్వకూడదు?  

స్టీవ్‌ స్మిత్‌ తిరిగి కెప్టెన్‌ అవుతాడా లేదా అన్న ఊహాగానాలకు తెరదించాలని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్‌ అడమ్‌ గిల్‌క్రిస్ట్‌ జాతీయ సెలక్టర్లను కోరాడు. 2018 బాల్‌ టాంపరింగ్‌ కుంభకోణం కారణంగా అప్పటి ఆసీస్‌ కెప్టెన్‌ స్మిత్‌...

Published : 14 Dec 2020 11:37 IST

సిడ్నీ: స్టీవ్‌ స్మిత్‌ తిరిగి కెప్టెన్‌ అవుతాడా లేదా అన్న ఊహాగానాలకు తెరదించాలని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్‌ అడమ్‌ గిల్‌క్రిస్ట్‌ జాతీయ సెలక్టర్లను కోరాడు. 2018 బాల్‌ టాంపరింగ్‌ కుంభకోణం కారణంగా అప్పటి ఆసీస్‌ కెప్టెన్‌ స్మిత్‌ ఏడాది నిషేధానికి గురైన సంగతి తెలిసిందే. అతడిపై విధించిన రెండేళ్ల కెప్టెన్సీ నిషేధం కూడా ఇటీవలే ముగిసింది. ఈ నేపథ్యంలో గిల్లీ మాట్లాడుతూ ‘‘ఎవరికైనా రెండో అవకాశం ఎందుకు ఇవ్వకూడదు? స్మిత్‌ కెప్టెన్సీ అందుకోవడానికి సెలక్టర్లకు ఎలాంటి అభ్యంతరం లేకపోతే, అతడూ సిద్ధంగా ఉంటే.. సెలక్టర్లు అతణ్ని వెంటనే వైస్‌ కెప్టెన్‌గా నియమించాలి’’ అని గిల్‌క్రిస్ట్‌ అన్నాడు. 

ఇవీ చదవండి..

పంత్‌-సాహా స్థానంపై నిర్ణయం తలనొప్పే!

భారత్‌కు లాభం.. ఆసీస్‌కు గందరగోళం!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని