IND vs ENG: భారత్‌ను వీడనున్న ఇంగ్లాండ్‌ క్రికెటర్లు కారణం ఇదే..

మూడో టెస్టు ప్రారంభానికి ముందు విరామ సమయాన్ని గడపడానికి ఇంగ్లాండ్‌ క్రికెటర్లు అబుదాబి వెళ్లనున్నారు. 

Published : 06 Feb 2024 12:22 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: విశాఖ టెస్టు(IND vs ENG)లో ఓటమి పాలైన ఇంగ్లాండ్‌ జట్టు భారత్‌ను వీడి అబుదాబి వెళ్లనుంది. రాజ్‌కోట్‌ టెస్టు ఫిబ్రవరి 15 నుంచి ప్రారంభం కానుండగా 10 రోజల విరామ సమయాన్ని అబుదాబిలో గడపడానికి పర్యటక జట్టు సిద్ధమైంది. కొంత విశ్రాంతి తీసుకుని తరువాత టెస్టుకు అన్ని విధాల సిద్ధమవుతామని జట్టు మేనేజ్‌మెంట్‌ పేర్కొంది. మొదటి టెస్టులో ఓటమి పాలైన భారత్‌ రెండో టెస్టులో ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో 5 మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను 1-1 తో సమం చేసింది. ఈ పర్యటనకు ముందు ఇంగ్లాండ్‌ జట్టు భారత స్పిన్నర్లను ఎదుర్కోవడానికి అబుదాబి క్యాంప్‌లో చాలా కసరత్తులు చేసింది. మొదటి టెస్టులో విజయం సాధించిన ఇంగ్లాండ్‌ రెండో టెస్టులో 106 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. రెండో టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో బుమ్రా  తన రివర్స్‌ స్వింగ్‌ బంతులతో 6 వికెట్లు తీసి ఇండియాకు ఆధిక్యాన్ని పెంచాడు. రెండో ఇన్నింగ్స్‌లో 399 పరుగుల లక్ష్య ఛేదన ప్రారంభించిన ఇంగ్లాండ్‌ను భారత్‌  సమష్టిగా రాణించి 292 పరుగులకు కట్టడి చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని