MS Dhoni: ఫైనల్‌ ఓవర్‌లో సిక్స్‌.. ధోనీ రికార్డు మరింత పదిలం

MS Dhoni: బుధవారం పంజాబ్‌తో జరిగిన ఐపీఎల్‌ మ్యాచ్‌లో చెన్నై ఓడిపోయింది. అయితే, ధోనీ మాత్రం ఇప్పటి వరకు తన పేరిట ఉన్న ఓ రికార్డును ఈ మ్యాచ్‌తో మరింత పదిలం చేసుకున్నాడు.

Updated : 02 May 2024 09:52 IST

చెన్నై: మహేంద్ర సింగ్‌ ధోనీ (MS Dhoni) చివరి బంతుల్లో చేసే మాయ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అతడి విన్నింగ్‌ షాట్స్‌ క్రికెట్‌కు కొత్త వన్నె తీసుకొచ్చాయనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. నాలుగు పదుల వయసులోనూ అదే ఆటతీరును కొనసాగిస్తున్నాడు. తాజా ఐపీఎల్‌ (IPL) సీజన్‌లోనూ వీలు కుదిరినప్పుడల్లా సొగసైన బౌండరీలు బాదుతున్నాడు. బుధవారం పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ అదే పునరావృతమైంది.

పంజాబ్‌ కింగ్స్‌ బుధవారం 7 వికెట్ల తేడాతో చెన్నైని ఓడించింది. మొదట చెన్నై బ్యాటుతో తడబడింది. ధోనీ (MS Dhoni) చివరి రెండు ఓవర్లు మిగిలి ఉండగా క్రీజులోకి వచ్చాడు. 11 బంతుల్లో 14 పరుగులు చేశాడు. చివరి ఓవర్‌లో అర్ష్‌దీప్‌ వేసిన ఐదో బంతిని భారీ సిక్స్‌గా మలిచి అభిమానులను కేరింతలు పెట్టించాడు. ఐపీఎల్‌లో చివరి ఓవర్‌లో ఇది ధోనీకి 66వ సిక్స్‌. ఫైనల్‌ ఓవర్‌లో అత్యధిక సిక్స్‌లు బాదిన రికార్డు ఇప్పటి వరకు అతడి పేరు మీదే ఉంది. ఇప్పుడు అది మరింత పదిలమైంది. 33 సిక్సులతో పోలార్డ్ రెండో స్థానంలో కొనసాగుతూ ధోనీని అందుకోలేనంత దూరంలో ఉన్నాడు.

చెన్నైకి పంజాబ్‌ పంచ్‌

ధోనీకి ఇది తొలి ఔట్‌..

ఈ ఐపీఎల్‌ సీజన్‌లో ధోనీ (MS Dhoni) తొలిసారి ఔటయ్యాడు. బుధవారం పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌కు ముందు వరకు అతడు ఒక్కసారి కూడా వికెట్‌ కోల్పోలేదు. బుధవారం కూడా అదే కొనసాగుతుందని ఊహించినప్పటికీ.. అనుకోకుండా చివరి బంతికి రనౌటయ్యాడు. అర్ష్‌దీప్‌ వేసిన ఇన్నింగ్స్‌ ఫైనల్‌ బాల్‌ను ధోనీ థర్డ్‌ మ్యాన్‌ దిశగా మలిచాడు. ఆ పొజిషన్‌లో ఉన్న హర్షల్‌ పటేల్‌ బంతిని వదిలేయడంతో ధోనీ రెండో పరుగుకు ప్రయత్నించాడు. కానీ, పటేల్‌ వెంటనే కోలుకొని బంతిని విసరడంతో బ్యాటర్‌ వైపు ఉన్న జితేశ్‌ వికెట్లను గిరాటేశాడు. ధోనీ కనీసం అంపైర్‌ వైపు కూడా చూడకుండా పెవిలియన్‌కు వెళ్లిపోయాడు. పంజాబ్‌తో మ్యాచ్‌కు ముందు వరకు ధోనీ 7 మ్యాచుల్లో నాటౌట్‌గా నిలిచి 260 స్ట్రైక్‌రేట్‌తో 96 పరుగులు చేశాడు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు