FIFA: ప్రపంచ పెద్దన్న గుండె బద్దలు కొట్టిన లాస్ట్‌మినిట్ గోల్..!
1982లో నాటి ప్రపంచ శక్తి సోవియట్‌కు వరల్డ్‌కప్ తొలి మ్యాచ్‌లోనే పరాభవం వెక్కిరించింది. మ్యాచ్ డ్రా చేసేందుకు అది చేసిన యత్నాలను బ్రెజిల్ ఆటగాడు చివరి క్షణాల్లో వమ్ముచేశాడు.
ఇంటర్నెట్‌డెస్క్: 1982 నాటికి ప్రపంచంలో ఇద్దరు పెద్దన్నలు మిగిలారు. అమెరికా, సోవియట్ యూనియన్. ఆయుధాల్లోనే కాదు.. ఆటల్లోనూ రారాజులుగా నిలుస్తూ వచ్చారు. క్రీడల్లో సోవియట్ కూడా తన శక్తి సామర్థ్యాలను ప్రపంచానికి రుచిచూపిస్తున్న రోజులవి. కానీ, ఆ ఏడాది జరిగిన ఫిఫా ప్రపంచకప్‌లో మొదట్లోనే సోవియట్‌కు గర్వభంగం జరిగింది. 1982 జూన్ 13న ప్రపంచకప్ మొదలైంది. 14వ తేదీన గ్రూప్-6లో బ్రెజిల్ - సోవియట్ యూనియన్ తలపడ్డాయి. బ్రెజిల్ అప్పటికే మూడుసార్లు (1958, 1962, 1970)ల్లో ప్రపంచకప్ విజేతగా నిలిచింది. ఈ టోర్నీలో సోవియట్‌తో జరిగిన తొలి మ్యాచ్ మొదటి నుంచి హోరాహోరీగా సాగింది. సోవియట్ ఆటగాడు ఆండ్రీ బల్.. మ్యాచ్ 35వ నిమిషంలోనే గోల్ సాధించి జట్టుకు ఆధిక్యం అందించాడు. దీంతో బ్రెజిల్ జట్టుపై ఒత్తిడి పెరిగిపోయింది. రష్యన్లు గోల్‌పోస్టుకు అడ్డుగోడవలే నిలిచారు. తొలి అర్ధ భాగంలో బ్రెజిల్‌కు ఎలాంటి గోల్ లభించలేదు. ఇక మ్యాచ్ 76వ నిమిషంలో స్కార్టెస్ అద్భుతమైన గోల్‌ను అందించడంతో బ్రెజిల్ స్కోర్‌ను సమం చేసింది. అక్కడి నుంచి అధిపత్యం కోసం హోరాహోరీ పోరు మొదలైంది.
మ్యాచ్ రెండు నిమిషాల్లో ముగుస్తుందనగా.. బ్రెజిల్ మైండ్‌గేమ్ మొదలుపెట్టింది. ఇక్కడ బ్రెజిల్ ఆటగాడికి అందిన బంతి వెంటనే సోవియట్ క్రీడాకారుడి ఆధీనంలోకి వెళ్లింది. అక్కడి నుంచి ఓ బ్రెజిల్ ఆటగాడు బంతిని అందిపుచ్చుకొని ఫాల్కావోకు అందేలా షాట్ కొట్టాడు. కానీ, అక్కడే ఫాల్కావో తెలివిగా తన కాళ్ల మధ్య నుంచి బంతిని వదిలేశాడు. మరో బ్రెజిల్ ఆటగాడు ఎడెర్ అలెక్సియో దానిని దొరకబుచ్చుకొని దాదాపు 25 మీటర్ల దూరం నుంచి సూటిగా గోల్‌పోస్టులోకి కొట్టాడు. కళ్లు చెదిరేలా ఉన్న ఈ షాట్ కొట్టే సమయంలో దాదాపు 8 మంది సోవియట్ ఆటగాళ్లు గోల్‌పోస్టుకు రక్షణగా ఉన్నారు. అయినా వారిని దాటుకొని బంతి 89వ నిమిషంలో గోల్‌పోస్ట్‌కు చేరింది. దీంతో బ్రెజిల్ 2-1 తేడాతో సోవియట్‌ను ఓడించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
పారిస్ ఒలింపిక్స్ రికర్వ్ ఆర్చరీలో తన అద్భుత ప్రదర్శనతో మన తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ ఆకట్టుకుంటున్నాడు. -
పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ ఈవెంట్లు.. పూర్తి షెడ్యూల్ ఇదే
ప్రపంచంలో అతిపెద్ద క్రీడా ఈవెంట్ ఆరంభానికి మరికొన్ని గంటల సమయమే ఉంది. రేపటి నుంచే ఒలింపిక్స్ పోటీలు ప్రారంభం కానున్నాయి. -
పది వచ్చే అవకాశం ఉందా! భారీ అంచనాలతో పారిస్‌లోకి అడుగుపెట్టిన భారత సేన
ఒలింపిక్స్ అనగానే అభిమానుల్లో ఎన్నో ఆశలు! భారత్ అదరగొడుతుందనే అంచనాలు! 100 మంది వెళ్తున్నారు 10 పతకాలైనా రావా అనే ఆలోచనలు! కానీ వాస్తవానికి పరిస్థితి వేరే ఉంటుంది. -
ఒలింపిక్స్ మస్కట్ ఫ్రీజ్ ముచ్చట తెలుసా..?
పారిస్ ఒలింపిక్స్‌కు మస్కట్ ఏమిటో తెలుసా.. ఓ టోపీ బొమ్మ. పెద్ద కళ్లతో ఆకర్షణీయంగా ఉన్న ఈ టోపీతో ఫ్రాన్స్ చరిత్రకు విడదీయలేని సంబంధం ఉంది. -
పారిస్ ఒలింపిక్స్.. ఆఖరి మజిలీలో ఆశ తీర్చుకుంటారా!
సీనియర్ అథ్లెట్లుగా పారిస్ ఒలింపిక్స్‌లోకి అడుగుపెట్టిన ముగ్గురు.. తొలి పతకం నెగ్గేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఎన్నో ఏళ్ల ఎదురుచూపులకు ఫుల్స్టాప్ పెట్టేయాలని చూస్తున్నారు. -
చేయి చేయి కలిపి పారిస్‌కు రక్షణ కవచం: 40 దేశాల నుంచి భద్రతా సిబ్బంది
పారిస్ ఒలింపిక్స్‌కు భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టంగా జరుగుతున్నాయి. దాదాపు 40 దేశాలకు చెందిన భద్రతా బృందాలు భాగం కావడం విశేషం. -
పారిస్ ఒలింపిక్స్‌లో ఆడేందుకు వేలు తొలగించుకొని..ఆసీస్ ఆటగాడి త్యాగం
పారిస్ ఒలింపిక్స్ ఆడేందుకు ఆటంకంగా మారుతుందని భావించి తన చేతి వేలును ఒక ఆటగాడు తొలగించుకొన్నాడు. -
పారిస్ ఒలింపిక్స్ ఆశలను ఆ నది ముంచేస్తోందా..?
ఒలింపిక్స్‌తో తమ పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయని ఆశించిన ఫ్రాన్స్‌కు.. ఇప్పుడు అది బెడిసికొట్టేలా ఉంది. స్విమ్మింగ్‌కు సంబంధించిన కొన్ని ఈవెంట్ల కారణంగా దేశం పరువు పోయే పరిస్థితి నెలకొంది. -
రికార్డు సెంచరీ చేసినా నో ప్లేస్.. టీమ్ఇండియా ఎంపికలో ఇవి గమనించారా?
సీనియర్లలో బుమ్రా, రవీంద్ర జడేజా విశ్రాంతి తీసుకుంటున్నారు. యువ క్రికెటర్లకు ప్రాతినిధ్యం ఇస్తూనే నాయకత్వ బాధ్యతల్లోకి కొత్తనీరు ఎక్కించాడు కోచ్ గంభీర్. -
టీమ్ఇండియా కొత్త కోచ్‌గా గంభీర్ ఏం చేస్తాడో!
భారత నూతన కోచ్‌గా గంభీర్ పేరును బీసీసీఐ ప్రకటించింది. దీంతో అతడు ఎలా రాణిస్తాడనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మెంటార్‌గా ఐపీఎల్లో అనుభవం ఉన్న సంగతి తెలిసిందే. -
ఆ ఒక్కటి తక్కువైంది.. ద్రవిడ్ మాటను నెరవేర్చాలి!
ప్రపంచ క్రికెట్లో భారత్ దూకుడు కొనసాగుతోంది. రెండేసిసార్లు వన్డే, టీ20 ప్రపంచ కప్‌లను నెగ్గింది. అయితే, ఒక్క కప్ మాత్రం అందడం లేదు. ఇప్పటికే రెండుసార్లు ప్రయత్నించినా సఫలం కాలేదు. -
జింబాబ్వేకు యువ భారత్.. ఈ కుర్రాళ్లపై ఓ లుక్కేద్దాం!
జింబాబ్వే పర్యటనకు టీమ్ఇండియా వెళ్లింది. కుర్రాళ్లతో కూడిన జట్టును సెలక్టర్లు ఎంపిక చేశారు. శుభ్‌మన్ గిల్ ఈ జట్టుకు నాయకత్వం వహిస్తాడు. -
ఛాంపియన్లు వస్తున్నారు
13 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఐసీసీ ట్రోఫీ సాధించిన టీమ్ఇండియాకు గురువారం స్వదేశంలో ఘనంగా స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. -
జింబాబ్వే పర్యటనకు భారత్.. గత హీరోలు ఎవరంటే?
జింబాబ్వేతో టీ20 సిరీస్ అయినా సరే తేలిగ్గా తీసుకోకూడదు. ఆ జట్టు కూడా పెద్ద టీమ్‌లకు షాక్ ఇచ్చిన దాఖలాలున్నాయి. భారత్ కూడా రెండు మ్యాచుల్లో ఓడిన చరిత్ర ఉంది. -
రోహిత్- కోహ్లీ లేని లోటును భర్తీ చేసేదెవరు?
పొట్టి వరల్డ్ కప్ ఫైనల్లో భారత్ విజయం సాధించిన అనంతరం రోహిత్, కోహ్లీ టీ20లకు గుడ్ బై చెప్పేశారు. మరి ఈ ద్వయం లేని లోటును ఏ ఆటగాళ్లు భర్తీ చేస్తారనే దానిపై చర్చ మొదలైంది. -
రోహిత్ తర్వాత ఎవరు..?
టీమ్ ఇండియాలో కెప్టెన్ స్థానం ఖాళీ అయింది. రోహిత్ స్థాయి నాయకత్వాన్ని భవిష్యత్తులో జట్టుకు అందించేవారి కోసం బీసీసీఐ అతి త్వరలోనే వేట మొదలు పెట్టవచ్చు. ఈ రేసులో కొందరు ఆటగాళ్లు ముందున్నారు. -
పొట్టి కప్పు విజేతగా భారత్.. వీళ్లనూ మరిచిపోవద్దు!
పెద్దగా అంచనాలు లేకుండా.. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని సత్తా చాటితే వారిని అభిమానులకు గుర్తుండి పోతారు. భారత్ ఛాంపియన్‌గా నిలవడంలో వీరూ కీలక పాత్ర పోషించారు. -
బుమ్రా యాక్షన్ స్పెషల్.. అందుకే కదిలించరు..!
టీమ్ ఇండియాలో జెస్సీ చాలా స్పెషల్. జట్టు కష్టాల్లో ఉందంటే నేనున్నానంటూ ముందుకొస్తాడు. తన మాయాజాలంతో ప్రత్యర్థి బ్యాటింగ్ లైనప్‌ను కకావికలం చేస్తాడు. అతడి బౌలింగ్ యాక్షన్ వెనుక ఆసక్తికరమైన అంశాలు మీకోసం.. -
సలామ్....శర్మా జీ! హిట్ మ్యాన్.. నీ ముద్ర చెరిగిపోనిది!
టీ20ల నుంచి రిటైర్ అయిన సందర్భంలో హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ప్రతిభ, రికార్డుల గురించి ఆసక్తికర కథనం... -
పైసా వసూల్.. మ్యాచ్ ప్రతి దశలో నరాలు తెగే ఉత్కంఠ..!
టీ20 ప్రపంచకప్ ఫైనల్స్‌లో ఓ హైవోల్టేజీ మ్యాచ్ ఆవిష్కృతమైంది. బ్యాటింగ్.. బౌలింగ్‌లో భారత్ పని అయిపోయిందనుకొన్న ప్రతిసారి నేలను తాకిన బంతిలా ఎగసిపడింది. ఓటమి కోరల్లో చిక్కుకొన్న మ్యాచ్‌ను దేశం కోసం గెలిచి చూపింది. -
‘మాటలు పడి’లేచిన కెరటం... పాండ్య
ఓడిపోయినప్పుడు మనది కాని రోజు ఇది అనుకోవాలి. గేలి చేస్తున్నప్పుడు గెలిచి చూపించాలి అనుకోవాలి. మనదైన రోజున మనమేంటో ఆడి చూపించాలి. టీ20 ప్రపంచకప్‌లో హార్దిక్ పాండ్య చేసింది ఇదే. ‘మాటలు పడి’లేచిన కెరటం పాండ్య గురించి ఓ సారి చూద్దాం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
పేర్లు ప్రదర్శించమని బలవంతం చేయలేరు: సుప్రీం
-
ఆ రాష్ట్రాలను విభజించే కుట్ర - మమతా బెనర్జీ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
‘మేం ఉండగా ఆమె పిల్లలు లేనివారు ఎలా అవుతారు?’: కమలాహారిస్‌కు సవతి కుమార్తె మద్దతు
-
17ఏళ్ల నాటి హత్య కేసు.. ఒకే ఫ్యామిలీలో తొమ్మిది మంది సహా 14మందికి జీవిత ఖైదు
-
రెడ్ బుక్ తెరవకముందే జగన్ గగ్గోలు పెడుతున్నారు: మంత్రి నారా లోకేశ్