ఒక్క ఓవర్లో 48

ఒక్క ఓవర్లో ఆరు సిక్సర్లే అద్భుతం అనుకుంటే.. నిరుడు ఒకే ఓవర్లో ఏడు సిక్సర్లతో రుతురాజ్‌ ఔరా అనిపించాడు. నోబ్‌నూ సిక్సర్‌గా మలచడంతో అప్పుడు 43 పరుగులు వచ్చాయి.

Published : 30 Jul 2023 04:49 IST

కాబుల్‌: ఒక్క ఓవర్లో ఆరు సిక్సర్లే అద్భుతం అనుకుంటే.. నిరుడు ఒకే ఓవర్లో ఏడు సిక్సర్లతో రుతురాజ్‌ ఔరా అనిపించాడు. నోబ్‌నూ సిక్సర్‌గా మలచడంతో అప్పుడు 43 పరుగులు వచ్చాయి. ఏడు సిక్సర్ల ఘనత మరోసారి నమోదైంది. ఈసారి అఫ్గానిస్థాన్‌ బ్యాటర్‌ సెదిఖుల్లా అటల్‌ ఈ రికార్డు అందుకున్నాడు. ఓవర్లో ఏకంగా 48 పరుగులు రావడం విశేషం. కాబుల్‌ ప్రిమియర్‌ లీగ్‌లో అబాసిన్‌ డిఫెండర్స్‌తో మ్యాచ్‌లో షహీన్‌షా హంటర్స్‌ కెప్టెన్‌ సెదిఖుల్లా (56 బంతుల్లో 118) చెలరేగిపోయాడు. అమీర్‌ జజాయ్‌ వేసిన 19వ ఓవర్లో తొలి బంతి పడకుండానే 12 పరుగులు వచ్చాయి. నోబాల్‌గా వేసిన మొదటి బంతికి సెదిఖుల్లా సిక్స్‌ కొట్టగా.. అదనపు బంతి వైడ్‌గా పడి బౌండరీ దాటడంతో మరో 5 పరుగులు లభించాయి. తర్వాతి ఆరు బంతులను సెదిఖుల్లా సిక్సర్లుగా మలిచి రికార్డు సృష్టించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని