ఒకేసారి ఇద్దరి సెంచరీ

వందో టెస్టు.. ఓ క్రికెటర్‌ జీవితంలో గొప్ప మైలురాయి. ఓ ఆటగాడు ఆ ఘనత అందుకోబోతుంటే ఆ మ్యాచ్‌ చాలా ప్రత్యేకంగా మారుతుంది.

Published : 06 Mar 2024 03:33 IST

ధర్మశాల: వందో టెస్టు.. ఓ క్రికెటర్‌ జీవితంలో గొప్ప మైలురాయి. ఓ ఆటగాడు ఆ ఘనత అందుకోబోతుంటే ఆ మ్యాచ్‌ చాలా ప్రత్యేకంగా మారుతుంది. అయితే ఒకే మ్యాచ్‌లో ఇద్దరు క్రికెటర్లు వందో టెస్టు మైలురాయిని అందుకుంటే..? గురువారం ధర్మశాలలో ఇదే జరగబోతోంది. భారత సీనియర్‌ ఆఫ్‌స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌, ఇంగ్లాండ్‌ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ జానీ బెయిర్‌స్టో టెస్టు మ్యాచ్‌ల శతకాన్ని అందుకోబోతున్నారు. ఇద్దరు ఆటగాళ్లు ఒకేసారి వందో టెస్టు మైలురాయిని అందుకోవడం తొలిసారి 2000లో జరిగింది. ఇంగ్లాండ్‌ మాజీ ఆటగాళ్లు మైక్‌ అథర్టన్‌, అలెక్‌ స్టివార్ట్‌ వెస్టిండీస్‌తో మ్యాచ్‌లో ఆ ఘనత సాధించారు. ఆ తర్వాత దక్షిణాఫ్రికా దిగ్గజ ఆటగాళ్లు కలిస్‌, పొలాక్‌.. న్యూజిలాండ్‌ మాజీ కెప్టెన్‌ ఫ్లెమింగ్‌ 2006లో ఒకేసారి ఈ మైలురాయిని చేరుకున్నారు. చివరగా 2013లో ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్లు అలిస్టర్‌ కుక్‌, మైకేల్‌ క్లార్క్‌ ఒకేసారి ఈ ఘనతను అందుకున్నారు. 2011లో అరంగేట్రం చేసిన అశ్విన్‌.. వందో టెస్టు మైలురాయిని అందుకోనున్న 14వ భారత ఆటగాడిగా నిలవనున్నాడు. 2012లో తొలి టెస్టు ఆడిన బెయిర్‌స్టో ఇంగ్లాండ్‌ తరఫున వందో టెస్టు ఆడనున్న 17వ ఆటగాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని