T20 World Cup: రోహిత్‌పై నమ్మకం లేదా?

న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో రోహిత్‌ శర్మను మూడో స్థానంలో ఆడించడం.. ట్రెంట్‌ బౌల్ట్‌ ఇన్‌స్వింగ్‌ను అతడు సమర్థంగా ఎదుర్కోగలడన్న నమ్మకం టీమ్‌ మేనేజ్‌మెంట్‌కు లేదనడానికి సూచికని మాజీ కెప్టెన్‌ సునీల్‌ గావస్కర్‌ అన్నాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లో మేటి బ్యాట్స్‌మన్‌గా

Updated : 02 Nov 2021 07:10 IST

దుబాయ్‌: న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో రోహిత్‌ శర్మను మూడో స్థానంలో ఆడించడం.. ట్రెంట్‌ బౌల్ట్‌ ఇన్‌స్వింగ్‌ను అతడు సమర్థంగా ఎదుర్కోగలడన్న నమ్మకం టీమ్‌ మేనేజ్‌మెంట్‌కు లేదనడానికి సూచికని మాజీ కెప్టెన్‌ సునీల్‌ గావస్కర్‌ అన్నాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లో మేటి బ్యాట్స్‌మన్‌గా పేరున్న రోహిత్‌ను కాదని కివీస్‌పై ఇషాన్‌ కిషన్‌ను ఓపెనర్‌గా పంపిన సంగతి తెలిసిందే. ‘‘ఇషాన్‌ కిషన్‌ కొడితే కొడతాడు లేదంటే లేదు. అలాంటి బ్యాట్స్‌మన్‌ 4 లేదా 5వ స్థానంలో వస్తే బాగుంటుంది. అప్పుడు అతడు మ్యాచ్‌ పరిస్థితికి తగినట్లుగా ఆడొచ్చు. ఇప్పుడు రోహిత్‌ను మూడో స్థానంలో పంపడమంటే.. ట్రెంట్‌ బౌల్ట్‌ ఎడమచేతి వాటం బౌలింగ్‌ను అతడు సమర్థంగా ఎదుర్కొంటాడన్న నమ్మకం లేదని అతడి ముఖం మీదే చెప్పినట్లు’’ అని గావస్కర్‌ అన్నాడు. ‘‘ఎన్నో ఏళ్లుగా ఓపెనింగ్‌ చేస్తున్న అటగాణ్ని అలా దిగువన పంపిస్తే.. స్వయంగా ఆ ఆటగాడు కూడా తనకు సామర్థ్యం లేదనుకుంటాడు. కిషన్‌ 70 పరుగులు చేసి ఉంటే మేము అభినందించేవాళ్లం. కానీ ఎత్తుగడ ఫలించనప్పుడు విమర్శలు సహజం. ఆ మార్పులు పని చేయలేదు. రోహిత్‌ లాంటి గొప్ప ఓపెనర్‌ మూడో స్థానంలో ఆడాడు. మూడో స్థానంలో ఎన్నో పరుగులు చేసిన కోహ్లి నాలుగులో ఆడాడు. కిషన్‌ లాంటి కుర్రాడికి ఓపెనింగ్‌ బాధ్యతలను అప్పగించారు’’ అని సన్నీ చెప్పాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని