ప్రతీకారం తీర్చుకోవాలని..

మహిళల హాకీ ప్రపంచకప్‌లో భారత్‌ పోరాటానికి వేళైంది. ఆదివారం పూల్‌-బి తొలి సమరంలో సవిత పునియా సారథ్యంలోని మన జట్టు ఇంగ్లాండ్‌తో తలపడనుంది. టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతక పోరులో ఇంగ్లాండ్‌ చేతిలో 3-4తో ఓడి కొద్దిలో చరిత్రాత్మక

Published : 03 Jul 2022 04:00 IST

మహిళల హాకీ ప్రపంచకప్‌

నేడే ఇంగ్లాండ్‌తో భారత్‌ ఢీ

అమ్‌స్టీల్‌వీన్‌ (నెదర్లాండ్స్‌): మహిళల హాకీ ప్రపంచకప్‌లో భారత్‌ పోరాటానికి వేళైంది. ఆదివారం పూల్‌-బి తొలి సమరంలో సవిత పునియా సారథ్యంలోని మన జట్టు ఇంగ్లాండ్‌తో తలపడనుంది. టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతక పోరులో ఇంగ్లాండ్‌ చేతిలో 3-4తో ఓడి కొద్దిలో చరిత్రాత్మక పతకాన్ని చేజార్చుకున్న భారత్‌.. ఆ ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలన్న పట్టుదలతో ఉంది. ఇటీవల ఎఫ్‌ఐహెచ్‌ ప్రొ లీగ్‌లో అద్భుతమైన ఫామ్‌ ప్రదర్శించిన సవిత బృందం.. మూడో స్థానంలో నిలిచి సత్తా చాటింది. ఇప్పుడు అదే జోరును ప్రపంచకప్‌లోనూ చూపించాలని భావిస్తోంది. రెగ్యులర్‌ కెప్టెన్‌ రాణీ రాంపాల్‌ స్థానంలో జట్టును నడిపిస్తున్న సవితపై అటు గోల్‌కీపర్‌గానూ పెద్ద భారమే ఉంది. దీప్‌గ్రేస్‌, గుర్జీత్‌ కౌర్‌, నవ్‌నీత్‌ కౌర్‌, షర్మిళాదేవి, లాల్‌రెమ్‌సియామి సత్తా చాటితే భారత్‌కు తిరుగుండదు. కానీ ప్రపంచ నాలుగో ర్యాంకు జట్టు ఇంగ్లాండ్‌ను తక్కువ అంచనా వేస్తే భారత్‌కు మరో పరాభవం తప్పకపోవచ్ఛు ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌ తర్వాత జులై 5న చైనా, 7న న్యూజిలాండ్‌తో మన జట్టు తలపడనుంది. 1974 ప్రపంచకప్‌లో నాలుగో స్థానంలో నిలవడమే ఇప్పటిదాకా ఈ టోర్నీలో భారత్‌కు అత్యుత్తమ ప్రదర్శన. చివరిగా ఆడిన 2018 ప్రపంచకప్‌లో 8వ స్థానంలో నిలిచింది. శుక్రవారమే మొదలైన ఈ ప్రపంచకప్‌లో తొలి మ్యాచ్‌లో స్పెయిన్‌ 4-1తో కెనడాను ఓడించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని