Mohammed shami: అది నా పని కాదు.. మహ్మద్‌ షమి అసహనం

Eenadu icon
By Sports News Desk Updated : 15 Oct 2025 06:46 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

కోల్‌కతా: ఆస్ట్రేలియా పర్యటనకు తనను పరిగణలోకి తీసుకోకపోవడం పట్ల భారత పేసర్‌ మహ్మద్‌ షమి అసహనం వ్యక్తం చేశాడు. రంజీ ట్రోఫీలో బెంగాల్‌ జట్టుకు అందుబాటులో ఉన్నానంటే తాను ఫిట్‌గా ఉన్నట్లేనని షమి అన్నాడు. ఫిట్‌నెస్‌ గురించి సెలెక్షన్‌ కమిటీకి సమాచారం అందించడం తన పని కాదని తెలిపాడు. ఈ నెల 19న ఆరంభం కానున్న పర్యటనలో మూడు వన్డేలు, అయిదు టీ20ల్లో భారత్, ఆసీస్‌ తలపడనన్నాయి. షమి ఫిట్‌నెస్‌పై సందేహాలతోనే అతణ్ని జట్టులోకి ఎంపిక చేయట్లేదని వార్తలొస్తున్న నేపథ్యంలో అతను స్పందించాడు. ‘‘ఎంపిక నా చేతుల్లో లేదని గతంలో కూడా చెప్పా. నాకేమైనా ఫిట్‌నెస్‌ సమస్యలు ఉండుంటే బెంగాల్‌ తరఫున ఆడుతూ ఉండకూడదు. దీని గురించి మాట్లాడి వివాదం సృష్టించాల్సిన అవసరం లేదని అనుకుంటున్నా. రంజీ ట్రోఫీలో నాలుగు రోజుల మ్యాచ్‌ ఆడగలిగినప్పుడు 50 ఓవర్ల క్రికెట్లోనూ బరిలో దిగగలను. ఫిట్‌నెస్‌ గురించి చెప్పడం.. అడగడం.. సమాచారం ఇవ్వడం నా బాధ్యత కాదు.. పని కాదు. ఎన్‌సీఏకు వెళ్లి సిద్ధమవడం.. మ్యాచ్‌లాడటమే నా పని’’ అని షమి పేర్కొన్నాడు.

Tags :
Published : 15 Oct 2025 06:45 IST

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని